జ్యోతిష సమాధానాలు

1

దీప లక్ష్మీ, శ్లోకాలు

108 దీప లక్ష్మీల శ్లోకాలు.

🌸 దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వ మంగళ రూపిణీ
ఆయురారోగ్యయైశ్వర్యం యావజ్జీవ మరోగతాం
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః

🌸 దీపదేవి మహాదేవీ సర్వవిద్యా ప్రకాశినీ
విద్యాం దేహి శ్రియం దేహి సర్వ కామ్యాంశ్చ దేహిమే
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః

🌸దీపజ్యోతి నమస్తుభ్యం సర్వదేవ స్వరూపిణీ
సౌఖ్యం దేహి బలం దేహి సామ్రాజ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపజ్యోతిషే నమః

🌸 జ్యోతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి విలాసినీ
గృహం దేహి ధనం దేహి విద్యాం దేహి మహేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః

🌸 ఆది లక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణీ
గృహం దేహి ఫలం దేహి ధాన్యం దేహి సురేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః

🌸 ధనలక్ష్మి నమస్తుభ్యం ధనధాన్య వివర్ధినీ
ధాన్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి రమేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం ధనలక్ష్మ్యై నమః

🌸 ధాన్యలక్ష్మి నమస్తేస్తు దానశీల స్వరూపిణీ
శ్రియం దేహి గృహం దేహి వ్రీహి దేహి ధనేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం దాన్యలక్ష్మ్యై నమః

🌸 విద్యాలక్ష్మి నమస్తేస్తు సర్వవిద్యాప్రదాయినీ
విద్యాం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం విద్యాలక్ష్మ్యై నమః

🌸 ధైర్యలక్ష్మి నమస్తుభ్యం సర్వ శౌర్య ప్రదాయినీ
వీర్యం దేహి జయం దేహి ధైర్యం దేహి శ్రియేశ్వరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం ధైర్యలక్ష్మ్యై నమః

🌸 జయలక్ష్మి నమస్తుభ్యం సర్వత్ర జయదాయినీ
జయందేహి శ్రియందేహి విజయం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం జయలక్ష్మ్యై నమః

🌸 విజయలక్ష్మీ నమస్తేస్తు సర్వత్ర విజయంవహే
వీర్యం దేహి వరం దేహి శౌర్యం దేహి జనేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం విజయలక్ష్మ్యై నమః

🌸 వీరలక్ష్మి నమస్తుభ్యం వీరదీర విదాయినీ
ధైర్యం దేహి జయం దేహి వీర్యం దేహి జయేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం వీరలక్ష్మ్యై నమః

🌸 రాజ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వసామ్రాజ్య దాయినీ
రాజ్యందేహి శ్రియందేహి రాజేశ్వరి నమోస్తుతే
ఓం హ్రీం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః

🌸 వరలక్ష్మీ నమస్తేస్తు సౌమాంగల్య వివర్ధినీ
మేధాం దేహి ప్రియం దేహి మాంగల్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం వరలక్ష్మ్యై నమః

🌸 హేమలక్ష్మి నమస్తుభ్యం కనకవర్ణ స్వరూపిణీ
శ్రియం దేహి ధనం దేహి హిరణ్యం దేహిమేసదా
ఓం హ్రీం శ్రీం హ్రీం హిరణ్యలక్ష్మ్యై నమః

🌸 గృహలక్ష్మీ నమస్తుభ్యం శంఖ పద్మ నిధీశ్వరి
శాంతిం దేహి శ్రియం దేహి యశో దేహి ద్విషోజహి
ఓం హ్రీం శ్రీం హ్రీం గృహలక్ష్మ్యై నమః

🌸 అన్నలక్ష్మి నమస్తుభ్యం అన్నపూర్ణ స్వరూపిణీ
అన్నం దేహి ఘ్రుతం దేహి ఇష్టాన్నం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం అన్నలక్ష్మ్యై నమః

🌸 గోలక్ష్మీనమస్తేస్తు గోవర్ధన ధరప్రియే
గవాం దేహి ప్రియాం దేహి సర్వం దేహి శివేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం గోలక్ష్మ్యై నమః

🌸 కీర్తి లక్ష్మీ నమస్తుభ్యం ఆదిమూల ప్రియేశ్వరీ
కీర్తిం దేహి శుభం దేహి శోభనం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం కీర్తిలక్ష్మ్యై నమః

🌸 సంతానలక్ష్మి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయినీ
పుత్రాన్ దేహి ధనం దేహి పౌత్రాన్ దేహి సుధేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం సంతానలక్ష్మ్యై నమః

🌸 రూపలక్ష్మి నమస్తుభ్యం సౌందర్య లహరీశ్వరీ
రూపం దేహి ప్రియం దేహి లావణ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః

🌸 భోగలక్ష్మీ నమస్తుభ్యం సర్వసంతోషదాయినీ
భోగందేహి శ్రియం దేహి సౌభాగ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం భోగలక్ష్మ్యై నమః

🌸 భాగ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌభాగ్య శాలినీ
మతిం దేహి గతిం దేహి మంగళం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం భాగ్యలక్ష్మ్యై నమః

🌸 సీతాలక్ష్మి నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ!
పతిందేహి ప్రియం దేహి భర్తారం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సీతాలక్ష్మ్యై నమః

🌸 పుష్టి లక్ష్మి నమస్తేస్తు సర్వ సంతుష్టి కారిణీ!
పుష్టిం దేహి దృఢమ్ దేహి పుత్ర వృద్ధి ప్రదాయినీ!
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్టి లక్ష్మ్యైనమః

🌸 తుష్టి లక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే!
తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టి లక్ష్మ్యై నమః

🌸 కాంతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశోభనకారిణీ!
కాంతిం దేహి ప్రియం దేహి సర్వ కామార్ధ సాధకే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మ్యై నమః

🌸 రాధాలక్ష్మి నమస్తుభ్యం వేణుగాన వినోదినీ!
మేధాం దేహి ప్రియం దేహి మహామంగళ రూపిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం రాదాలక్ష్మ్యై నమః

🌸 శాంతిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి!
శాంతం దేహి యశోదేహి దేహిమే రమా శ్రియం!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శాంతిలక్ష్మ్యై నమః

🌸 మేధా లక్ష్మి నమస్తుభ్యం మధుసూదన కామినీ!
బుద్ధిం దేహి శ్రియం దేహి మహా మేధారావ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః

🌸 ప్రజ్ఞా లక్ష్మీ నమస్తేస్తు ప్రధాన పురుషేశ్వరీ!
మేధాం దేహి కృపాం దేహి మహీం దేహి జనేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః

🌸 భూమిలక్ష్మి నమస్తేస్తు సర్వసస్య ప్రదాయినీ!
మహీం దేహి శ్రియం దేహి మహా మహిమశాలినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భూలక్ష్మ్యై నమః

🌸 భువనలక్ష్మి నమస్తేస్తు భువనేశ్వరి నమోస్తుతే!
సస్యం దేహి ధనం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

🌸 దయాలక్ష్మి నమస్తేస్తు దామోదర ప్రియంకరీ!
దయాం దేహి కృపాం దేహి ధరణీధర వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దయాలక్ష్మ్యై నమః

🌸 శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరి!
శుభం దేహి ధనం దేహి శోభనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శుభలక్ష్మ్యై నమః

🌸 క్షేమలక్ష్మీ నమస్తుభ్యం సర్వక్షేత్ర నివాసినీ!
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం మహేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేమలక్ష్మ్యై నమః

🌸 లాభలక్ష్మీ నమస్తుభ్యం లలితే పరమేశ్వరీ!
లాభందేహి ధనం దేహి కారుణ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం లాభలక్ష్మ్యై నమః

🌸 గజలక్ష్మీ నమస్తుభ్యం గృహలక్ష్మి నమోస్తుతే!
గృహం దేహి శ్రియం దేహి గజేంద్ర వరదాశ్రితే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం గజలక్ష్మ్యై నమః

🌸 కృపాలక్ష్మి నమస్తుభ్యం కృష్ణ పత్ని నమోస్తుతే!
కృపాం దేహి దయాం దేహి గరుడధ్వజ వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కృపాలక్ష్మ్యై నమః

🌸 బిల్వ లక్ష్మి నమస్తుభ్యం అచ్యుత ప్రాణ నాయకే!
సౌఖ్యం దేహి ధృవం దేహి ఆరోగ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః

🌸 దుర్గాలక్ష్మి నమస్తేస్తు చండముండ వినాశినీ!
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దుర్గాలక్ష్మ్యై నమః

🌸 రసలక్ష్మి నమస్తుభ్యం మధురాపుర వాసినీ!
దీనేమయి కృపాం కృత్వా మధురం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం రసలక్ష్మ్యై నమః

🌸స్థిరలక్ష్మి నమస్తుభ్యం శ్రీధర ప్రియభామినీ!
భక్తిం దేహి ప్రియం దేహి ముక్తిమార్గ ప్రదర్శినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం స్థిరలక్ష్మ్యై నమః

🌸 ద్వారలక్ష్మి నమస్తుభ్యం ద్వారకా నాయక ప్రియే!
శ్రియం దేహి గృహం దేహి దేహిమే భవనం సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ద్వారలక్ష్మ్యై నమః

🌸 సత్యలక్ష్మి నమస్తుభ్యం నిత్య కళ్యాణ దాయినీ!
క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః

🌸 యోగాలక్ష్మి నమస్తుభ్యం సిద్ధి బుద్ధి ప్రదాయినీ!
భోగం దేహి సుఖం దేహి యోగ సిద్ధిం చ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం యోగలక్ష్మ్యై నమః

🌸 బుద్ధి లక్ష్మి నమస్తుభ్యం యోగమార్గ ప్రదర్శినీ!
బుద్ధి సిద్ధి ప్రదం దేహి భుక్తి ముక్తి ప్రదాయినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః

🌸 భువన లక్ష్మి నమస్తుభ్యం భువనాధార వాహినీం!
గృహం దేహి శ్రియం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

🌸 వీణాలక్ష్మి నమస్తుభ్యం సదా మధుర భాషిణీ!
గీతాం దేహి స్వరం దేహి గానం దేహి సరస్వతీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వీణాలఖ్మ్యై నమః

🌸 వర్ణలక్ష్మి నమస్తుభ్యం స్వరాకర్షణ భైరవీ!
వర్ణం దేహి వరం దేహి సువర్ణం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వర్ణలక్ష్మ్యై నమః

🌸 కమలలక్ష్మి నమస్తేస్తు కమలేశ్వరి నమోస్తుతే
కీర్తిం దేహి శాంతిం దేహి ఫలం దేహిమే సౌగంధి
ఓం హ్రీం శ్రీం హ్రీం కమలక్ష్మై నమః

🌸 కారుణ్యలక్ష్మి నమస్తేస్తు కారుణ్యేశ్వరి నమోస్తుతే
కరుణం దేహి దయాం దేహి కృపాం దేహిమే కరుణేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం కారుణ్యలక్మ్యై నమః

🌸శ్రీలక్ష్మి నమస్తేస్తు సిరి మహాదేవి నమోస్తుతే
ధనం దేహి జయం దేహి సౌక్యం దేహిమే నిత్యకళ్యాణి
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః

🌸స్వర్ణలక్ష్మి నమస్తేస్తు సువర్ణరూపే నమోస్తుతే
సువర్ణం దేహి సుచలం దేహి సుదేహం దేహిమే స్వర్ణధారిణి
ఓం హ్రీం శ్రీం హ్రీం స్వర్ణలక్ష్మ్యై నమః

🌸 ఫలరూపలక్ష్మి నమస్తేస్తు సంపూర్ణరూపే నమోస్తుతే
ఫలం దేహి బలం దేహి ధనం దేహిమే ఫలదాత్రి
ఓం హ్రీం శ్రీం హ్రీం ఫలరూపలక్ష్మ్యై నమః

🌸 రత్నలక్ష్మి నమస్తేస్తు రత్నేశ్వరి నమోస్తుతే
రత్నం దేహి శ్రియం దేహి కీర్తిం దేహిమే ప్రకాశినీ
ఓం హ్రీం శ్రీం హ్రీం రత్నలక్ష్మ్యై నమః

🌸 త్రికాలలక్ష్మి నమస్తేస్తు త్రికాలేశ్వరి నమోస్తుతే
జయందేహి శ్రియందేహి విజయం దేహిమే జ్ఞాన సంపన్నాయై
ఓం హ్రీం శ్రీం హ్రీం త్రికాలక్ష్మ్యై నమః

🌸 బ్రహ్మాండలక్ష్మి నమస్తేస్తు జననీ మహాలక్ష్మి నమోస్తుతే
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం వసుప్రదాయై
ఓం హ్రీం శ్రీం హ్రీం బ్రహ్మాండలక్ష్మ్యై నమః

🌸 హిమలక్ష్మి నమస్తేస్తు హిమేశ్వరి నమోస్తుతే
జలం దేహి ప్రియం దేహి యోగం దేహిమే కమలాయై
ఓం హ్రీం శ్రీం హ్రీం హిమలక్ష్మ్యై నమః

🌸 పీతాంబరలక్ష్మి నమస్తేస్తు ప్రకాశధారి నమోస్తుతే
శుభం దేహి ప్రకాశం దేహి శోభనం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం పీతాంబరలక్ష్మ్యై నమః

🌸 సంతోషలక్ష్మి నమస్తేస్తు నిత్యశోభిని నమోస్తుతే
శోభం దేహి సంతోషం దేహి సాధనం దేహిమే సర్వార్థ సాధకీ
ఓం హ్రీం శ్రీం హ్రీం సంతోషలక్ష్మ్యై నమః

🌸 నిత్యలక్ష్మి నమస్తేస్తు కృష్ణ పత్ని నమోస్తుతే
సత్యం దేహి సాధకం దేహి ప్రియం దేహిమే సౌందర్యేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః
🌸 ఆరోగ్యలక్ష్మి నమస్తేస్తు దారిద్ర్యరహితి నమోస్తుతే
ఆరోగ్యం దేహి ఆయువు దేహి సౌభాగ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః

🌸 చతుర్భుజలక్ష్మి నమస్తేస్తు మహాలక్ష్మి నమోస్తుతే
కృపాం దేహి మధురం దేహి భాగ్యం దేహిమే కోమలాంగి
ఓం హ్రీం శ్రీం హ్రీం చతుర్భుజలక్ష్మ్యై నమః

🌸 విశ్వలక్ష్మి నమస్తేస్తు విశ్వమూర్తే నమోస్తుతే
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే విశ్వభత్రి
ఓం హ్రీం శ్రీం హ్రీం విశ్వలక్ష్మ్యై నమః

🌸 ప్రియలక్ష్మి నమస్తేస్తు పతివ్రతే నమోస్తుతే
సౌఖ్యం దేహి సౌభాగ్యం దేహి సౌశీల్యం దేహిమే పతిప్రియే
ఓం హ్రీం శ్రీం హ్రీం విష్ణుప్రియేలక్ష్మ్యై నమః

🌸గీతలక్ష్మి నమస్తేస్తు రాగమూర్తే నమోస్తుతే
గీతం దేహి రాగం దేహి శాంతం దేహిమే గీతరూపే
ఓం హ్రీం శ్రీం హ్రీం గీతలక్ష్మ్యై నమః

🌸 స్తోత్రలక్ష్మి నమస్తేస్తు రమేశ్వరీ నమోస్తుతే
స్తోత్రం దేహి మంత్రం దేహి శ్లోకం దేహిమే స్తోత్రప్రియే
ఓం హ్రీం శ్రీం హ్రీం స్తోత్రలక్ష్మ్యై నమః

🌸భుక్తిలక్ష్మి నమస్తేస్తు భక్ష్యరూపే నమోస్తుతే
భుక్తం దేహి అన్నం దేహి సర్వం దేహిమే భుక్తిదాత్రి
ఓం హ్రీం శ్రీం హ్రీం భుక్తిలక్ష్మ్యై నమః

🌸 ప్రాఙ్ఞలక్ష్మి నమస్తేస్తు ఆఙ్ఞాకారి నమోస్తుతే
ప్రఙ్ఞం దేహి కీర్తిం దేహి కృపాం దేహిమే ప్రాఙ్ఞవంద్యే
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రాఙ్ఞలక్ష్మ్యై నమః

🌸 భక్తిలక్ష్మి నమస్తేస్తు మోక్షకారి నమోస్తుతే
మోక్షం దేహి కృపాం దేహి దయాం దేహిమే భక్తిగమ్యే
ఓం హ్రీం శ్రీం హ్రీం భక్తిలక్ష్మ్యై నమః

🌸 దివ్యలక్ష్మి నమస్తేస్తు మహాశక్తి నమోస్తుతే
దీనేమయి కృపాం కృత్వా మధురం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం దివ్యలక్ష్మ్యై నమః

🌸 కృష్ణలక్ష్మి నమస్తేస్తు మధురాపుర వాసినీ నమోస్తుతే
క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహిమే కృష్ణరూపే
ఓం హ్రీం శ్రీం హ్రీం కృష్ణలక్ష్మ్యై నమః

🌸 సముద్రలక్ష్మి నమస్తేస్తు భూతనయే నమోస్తుతే
ధైర్యం దేహి జయం దేహి వీరం దేహిమే జయేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం సముద్రలక్ష్మ్యై నమః

🌸 హృదయలక్ష్మి నమస్తేస్తు వైకుంఠవాసిని నమోస్తుతే
.గృహం దేహి శ్రియం దేహి భవనం దేహిమే పరమాత్మికాయై
ఓం హ్రీం శ్రీం హ్రీం హృదయలక్ష్మ్యై నమః

🌸 శ్వేతాంబరలక్ష్మి నమస్తుభ్యం నానాలంకార భూషితే
శాంతిం దేహి క్రాంతిం దేహి బ్రాంతారిష్ట నివారిణీ
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్వేతాంబరలక్ష్మ్యై నమః

🌸 సూక్ష్మరూపలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే
శక్తిం దేహి భక్తిం దేహి మహా రౌద్రే
ఓం హ్రీం శ్రీం హ్రీం సూక్ష్మరూపలక్ష్మ్యై నమః

🌸 మహా మాయాలక్ష్మి నమస్తుభ్యం మహా పాప వినాశినీ
మేధాం దేహి కృపాం దేహి మహామంగళ రూపిణీ
ఓం హ్రీం శ్రీం హ్రీం మహా మాయాలక్ష్మ్యై నమః

🌸ముగ్ధలక్ష్మి నమస్తుభ్యం సౌంధర్య స్వరూపిణీ
శోభం దేహి సర్వం దేహి లావణ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం ముగ్ధలక్ష్మ్యై నమః

🌸గోపాలక్ష్మీనమస్తేస్తు గోవర్ధన ధరప్రియే
సుమం దేహి క్షీరం దేహి ధనం దేహి గోపేశ్వరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం గోపాలక్ష్మ్యై నమః

🌸ధర్మలక్ష్మి నమస్తుభ్యం లోకశోక వినాశిన కారిణీ!
స్నేహం దేహి మిత్రం దేహి సర్వ ధర్మార్ధ సాధకే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ధర్మలక్ష్మ్యై నమః

🌸 ఫలలక్ష్మి నమస్తుభ్యం యశస్విన్యై
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం మహేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం ఫలలక్ష్మ్యై నమః

🌸విష్ణులక్ష్మి నమస్తుభ్యం ముక్తి ప్రదాయిని
పుత్రాం దేహి ధనం దేహి పౌత్రాం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం విష్ణులక్ష్మ్యై నమః

🌸 హరిణ్యైలక్ష్మి నమస్తుభ్యం నానాలంకార భూషితే
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం హరిణ్యైలక్ష్మ్యై నమః

🌸 యశస్విలక్ష్మి నమస్తుభ్యం ప్రసన్నా వరదా
బుద్ధిం దేహి శ్రియం దేహి యోగజ్ఞే యోగ సంభూతే
ఓం హ్రీం శ్రీం హ్రీం యశస్విలక్ష్మ్యై నమః

🌸 ఆద్యంతలక్ష్మి నమస్తుభ్యం శ్రీ పీఠే సుర పూజితే
శ్రియైం దేహి శివాం దేహి సర్వజ్ఞే సర్వ వరదే
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆద్యంతలక్ష్మ్యై నమః

🌸 జగత్ లక్ష్మి నమస్తుభ్యం ఇందుశీతుల పూజితే
పూజ్యం దేహి ధనం దేహి భవనం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం జగత్ లక్ష్మ్యై నమః

🌸 చతుర్భుజాలక్ష్మి నమస్తుభ్యం త్రికాలం యః పటేన్నిత్యం
రమ్యం దేహి రత్నం దేహి సర్వ దుష్ట భయంకరి
ఓం హ్రీం శ్రీం హ్రీం చతుర్భుజాలక్ష్మ్యై నమః

🌸 హరివల్లభలక్ష్మి నమస్తుభ్యం వసుధారిణ్యలహరీ
శ్వేతం దేహి పద్మం దేహి జగత్స్థితే జగన్మాతే
ఓం హ్రీం శ్రీం హ్రీం హరివల్లభలక్ష్మ్యై నమః

🌸 సురభలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే
జ్ఞానం దేహి లౌక్యం దేహి మహా రౌద్రే
ఓం హ్రీం శ్రీం హ్రీం సురభలక్ష్మ్యై నమః

🌸 సర్వభూతహితలక్ష్మి నమస్తుభ్యం మంత్ర మూర్తే సదా దేవి
సుహృదయం దేహి ఆనందం దేహి పరమాత్మికాయైనే
ఓం హ్రీం శ్రీం హ్రీం సర్వభూతహితలక్ష్మ్యై నమః

🌸 శక్తిలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే
శక్తిం దేహి యుక్తిం దేహి నానాలంకార భూషితే
ఓం హ్రీం శ్రీం హ్రీం శక్తిలక్ష్మ్యై నమః

🌸 సుధాలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే
ప్రేమం దేహి ఇష్టం దేహి హిరణ్మయ్యై సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం సుధాలక్ష్మ్యై నమః

🌸 కామాక్ష్యైలక్ష్మి నమస్తుభ్యం శ్వేతాంబరధారే
మోక్షం దేహి సుచలం దేహి యోగజ్ఞే యోగ సంభూతే
ఓం హ్రీం శ్రీం హ్రీం కామాక్ష్యైలక్ష్మ్యై నమః

🌸 అనుగ్రహలక్ష్మి నమస్తుభ్యం సర్వసంతోషదాయినీ
ఆరోగ్యం దేహి సులోచనం దేహి పద్మాసన స్థితే
ఓం హ్రీం శ్రీం హ్రీం అనుగ్రహలక్ష్మ్యై నమః

🌸 త్రిలోకలక్ష్మి నమస్తుభ్యం త్రిలోకశోక వినాశినీ
భక్తిం దేహి శ్లోకం దేహి ధర్మనిలయాధాత్రీ
ఓం హ్రీం శ్రీం హ్రీం అనుగ్రహలక్ష్మ్యై నమః

🌸 పద్మహస్తాలక్ష్మి నమస్తుభ్యం ధన ధాన్య సమన్వితే
ధరణీం దేహి పవనం దేహి మహాలక్ష్మీ ర్నమోస్తుతే
ఓం హ్రీం శ్రీం హ్రీం పద్మహస్తాలక్ష్మ్యై నమః

🌸 పుణ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వభూత హితప్రదాయినే
పుణ్యం దేహి వరం దేహి భుక్తి ముక్తి ప్రదాయిని
ఓం హ్రీం శ్రీం హ్రీం పుణ్యలక్ష్మ్యై నమః

🌸 శ్రీపీఠలక్ష్మి నమస్తుభ్యం సర్వఙ్ఞే సర్వవరదే
సిరిం దేహి సుకరం దేహి ఆహ్లోదజనన్యై
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీపీఠలక్ష్మ్యై నమః

🌸 సకలభోగసౌభాగ్యలక్ష్మి నమస్తుభ్యం మాతా సర్విష్టే
సకలం దేహి సౌభాగ్యం దేహి నారాయణ ప్రణయినీ
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీపీఠలక్ష్మ్యై నమః

🌸 గంధలక్ష్మి నమస్తుభ్యం గంధమాల్యశోభితే
సుగంధం దేహి సుశీలం దేహి హేమాంబుజ పీఠే
ఓం హ్రీం శ్రీం హ్రీం గంధలక్ష్మ్యై నమః
🌸పుష్కరలక్ష్మి నమస్తుభ్యం కమలాక్ష వల్లభే
పుణ్యం దేహి మోక్షం దేహి జగదీశ్వరి లోకమాతః
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్కరలక్ష్మ్యై నమః

🌸 యుక్తిలక్ష్మి నమస్తుభ్యం గుణాధికా గురుతుర భాగ్యే
ప్రాణం దేహి యోగం దేహి హరినీలమయీ విభాతే
ఓం హ్రీం శ్రీం హ్రీం యుక్తిలక్ష్మ్యై నమః

🌸 ఆశ్రయలక్ష్మి నమస్తుభ్యం మధుమాథిని మన్మథే
ఆశ్రయం దేహి ఆరోగ్యం దేహి ఆనందకందమని
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆశ్రయలక్ష్మ్యై నమః

🌸 నిత్యానందలక్ష్మి నమస్తుభ్యం కథమపి సహస్రేణ శిరసాం
ఆనందం దేహి ఐశ్వర్యం దేహి మకరంద శ్రుతిఝరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం నిత్యానందలక్ష్మ్యై నమః

🌸 కౌమారలక్ష్మి నమస్తుభ్యం ధర్మైక్య నిష్ఠాకరీ
రక్షం దేహి సురక్షితం దేహి బ్రహ్మాండ భాండోదరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం కౌమారలక్ష్మ్యై నమః

🌸 వైకుంఠలక్ష్మి నమస్తుభ్యం దాక్షాయిణీ సుందరీ
క్షీరం దేహి ఆమృతం దేహి సౌభాగ్యమాహేశ్వరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం వైకుంఠలక్ష్మ్యై నమః

🌸 దృశ్యాదృశ్యదీపాంకృతలక్ష్మి నమస్తుభ్యం ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ
దీపం దేహి ధీరం దేహి ప్రజ్వలీ కృపాసాగరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం దృశ్యాదృశ్యదీపాంకృతలక్ష్మ్యై నమః

2

శ్రీ ఆంజనేయం


🌸శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
నమో ఆంజనేయం నమో దివ్యకాయం
నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం
నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం
నమో మారుతిం రామదూతం నమామి

నమో వానరేశం నమో దివ్యభాసం
నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం
నమో శత్రుసంహారకం వజ్రకాయం
నమో మారుతిం రామదూతం నమామి

🌸శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
నమో వానరేంద్రం నమో విశ్వపాలం
నమో విశ్వమోదం నమో దేవశూరం
నమో గగన సంచారితం పవన తనయం
నమో మారుతిం రామదూతం నమామి

నమో రామదాసం నమో భక్తపాలం
నమో ఈశ్వరాంశం నమో లోకవీరం
నమో భక్త చింతామణిం గదాపాణిం
నమో మారుతిం రామదూతం నమామి

🌸 శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
నమో పాపనాశం నమో సుప్రకాశం
నమో వేదసారం నమో నిర్వికారం
నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్ఠం
నమో మారుతిం రామదూతం నమామి

నమో కామరూపం నమో రౌద్రరూపం
నమో వాయుతనయం నమో వానరాగ్రం
నమో భక్త వరదాయకం ఆత్మవాసం
నమో మారుతిం రామదూతం నమామి

🌸శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
నమో రమ్యనామం నమో భవపునీతం
నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం
నమో శత్రు కిరరూపం
నమో మారుతిం రామదూతం నమామి

నమో దేవదేవం నమో భక్తరత్నం
నమో అభయవరదం నమో పంచవదనం
నమో శుభగ శుభమంగళం ఆంజనేయం
నమో మారుతిం రామదూతం నమామి

🌸శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే

 

3

అఘనాశకగాయత్రీస్తోత్రం


🌸 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.

🌸శ్రీ దేవీ భాగవత మహాపురాణ ( సంస్కృత మూలం ) లోని 12 వ స్కంధమునందలి, 5 వ అధ్యాయము నందు ఈ పరమ పవిత్రమైన అఘనాశక గాయత్రీ స్తోత్రమున్నది.

నారద ఉవాచ -
🌸భక్తానుకంపిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనం. గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ..

🌸1. ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి.
సర్వత్ర వ్యాపికేఽనంతే శ్రీసంధ్యే తే నమోఽస్తుతే..


🌸2. త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ.
బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా.


🌸3. ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః.
బ్రహ్మా సాయం భగవతీ చింత్యతే మునిభిః సదా..


🌸4. వృద్ధా సాయం హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ.
ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః..


🌸5. యజుర్వేదం పఠంతీ చ అంతరిక్షే విరాజతే.
సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి..


🌸6. రుద్రలోకం గతా త్వం హి విష్ణులోకనివాసినీ.
త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ..


🌸7. సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా.
శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా..


🌸8. ఆనందజననీ దుర్గా దశధా పరిపఠ్యతే.
వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ..


🌸9. గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ.
నీలగంగా తథా సంధ్యా సర్వదా భోగమోక్షదా..


🌸10. భాగీరథీ మర్త్యలోకే పాతాలే భోగవత్యపి.
త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ..


🌸11. భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ.
భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః..


🌸12. మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి.
తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్..


🌸13. కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకగా.
బ్రహ్మలోకదా రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాంగనివాసినీ..


🌸14.అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే.
సామ్యావస్థాత్మికా త్వం హి శబలబ్రహ్మరూపిణీ..


🌸15. తతః పరాపరా శక్తిః పరమా త్వం హి గీయసే.
ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా..


🌸16. గంగా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ.
సరయూర్దేవికా సింధుర్నర్మదేరావతీ తథా..


🌸17. గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా.
కౌశికీ చంద్రభాగా చ వితస్తా చ సరస్వతీ..


🌸18. గండకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి.
ఇడా చ పింగలా చైవ సుషుమ్ణా చ తృతీయకా..


🌸19. గాంధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ.
అలంబుషా కుహూశ్చైవ శంఖినీ ప్రాణవాహినీ..


🌸20. నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః.
హృతపద్మస్థా ప్రాణశక్తిః కంఠస్థా స్వప్ననాయికా..


🌸21. తాలుస్థా త్వం సదాధారా బిందుస్థా బిందుమాలినీ.
మూలే తు కుండలీ శక్తిర్వ్యాపినీ కేశమూలగా..


🌸22. శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ.
కిమన్యద్ బహునోక్తేన యత్కించిజ్జగతీత్రయే..


🌸23. తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సంధ్యే నమోఽస్తు తే.
ఇతీదం కీర్తితం స్తోత్రం సంధ్యాయాం బహుపుణ్యదం..


🌸24. మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకం.
య ఇదం కీర్తయేత్ స్తోత్రం సంధ్యాకాలే సమాహితః..


🌸25. అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్.
సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్..


🌸26. భోగాన్ భుక్త్వా చిరం కాలమంతే మోక్షమవాప్నుయాత్.
తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్..


🌸27. యత్ర కుత్ర జలే మగ్నః సంధ్యామజ్జనజం ఫలం.
లభతే నాత్ర సందేహః సత్యం చ నారద..


🌸28. శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ ప్రముచ్యతే.
పీయూషసదృశం వాక్యం సంధ్యోక్తం నారదేరితం..


🌸ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే పంచమోఽధ్యాయే శ్రీఅఘనాశకగాయత్రీస్తోత్రం సంపూర్ణం..
4

అనఘాష్టమి వ్రతం


అనఘాష్టమి వ్రతం, పూజా విధి విధానం

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


🌸దీపము వెలిగించి దీపపు ప్రమిదలకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టవలయును.

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

🌸ఆచమనం
* ఓం కేశవాయ స్వాహా,
* ఓం నారాయణాయ స్వాహా,
* ఓం మాధవాయ స్వాహా,

అని ఉద్ధరిణితో కుడిచేతిలో జలమును తీసుకుని మూడుసార్లు ఆచమనం చేయాలి

* ఓం గోవిందాయ నమః,
* ఓం విష్ణవే నమః,
* ఓం మధుసూదనాయ నమః,
* ఓం త్రివిక్రమాయ నమః,
* ఓం వామనాయ నమః,
* ఓం శ్రీధరాయ నమః,
* ఓం ఋషీకేశాయ నమః,
* ఓం పద్మనాభాయ నమః,
* ఓం దామోదరాయ నమః,
* ఓం సంకర్షణాయ నమః,
* ఓం వాసుదేవాయ నమః,
* ఓం ప్రద్యుమ్నాయ నమః,
* ఓం అనిరుద్దాయ నమః,
* ఓం పురుషోత్తమాయ నమః,
* ఓం అధోక్షజాయ నమః,
* ఓం నారసింహాయ నమః,
* ఓం అచ్యుతాయ నమః,
* ఓం జనార్ధనాయ నమః,
* ఓం ఉపేంద్రాయ నమః,
* ఓం హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //


లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాఅం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుందశీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //


🌸ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ప్రాణాయామము కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును చెప్పవలెను 🌸ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ . ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య వాయువ్య మీరు ఉన్న దిక్కును చప్పండి ప్రదేశే కృష్ణ /గంగా / గోదావర్యోర్మద్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర/దక్షిన ఆయనే ప్రస్తుత ఋతువు ఋతౌ ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి తిథౌ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రముప్రస్తుత యోగము శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ, శ్రీమాన్ మీ గొత్రము గోత్రస్య మీ పూర్తి పేరు నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన, కనక, వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకలకార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్యర్ధం, పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ అనఘ దేవతా ముద్దిశ్య శ్రీ అనఘ దేవతా ప్రీత్యర్ధం యావత్శక్తి, ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే శుభనక్షత్రే.

అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను. తదంగత్వేన కలశారాధనం కరిష్యే.

కలశారాధనం
🌸శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః


అంటూ మీరు వేరుగా ఉంచుకున్నమరొక కలశానికి గంధం , కుంకుమతో బొట్టుపెట్టి ఆతర్వాత కలశములో కొన్ని పుష్పాలు, అక్షితలు వేసి కలశాన్ని చేతితో మూసి ఈ క్రింది మంత్రం చెప్పుకోవాలి.

🌸శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య


కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపుతో చేసిన వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.

🌸మం // ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అక్షతలుస్వామివారి వద్ద వుంచి నమస్కరించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి జలమును చల్లవలెను
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి జలమును చల్లవలెను
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి జలము చల్లవలెను
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలు వస్త్రంగా భావించి స్వామివారి వద్ద వుంచి నమస్కరించాలి
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి పుష్పానికి గంధం అద్ది స్వామివారి వద్ద ఉంచాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు లేదా పుష్పాలతో గణపతిని అర్చించాలి.

* ఓం సుముఖాయ నమః,
* ఓం ఏకదంతాయ నమః,
* ఓం కపిలాయ నమః,
* ఓం గజకర్ణికాయ నమః,
* ఓం లంబోదరాయ నమః,
* ఓం వికటాయ నమః,
* ఓం విఘ్నరాజాయ నమః,
* ఓం గణాదిపాయ నమః,
* ఓం ధూమకేతవే నమః,
* ఓం గణాధ్యక్షాయ నమః,
* ఓం ఫాలచంద్రాయ నమః,
* ఓం గజాననాయ నమః,
* ఓం వక్రతుండాయనమః,
* ఓం శూర్పకర్ణాయ నమః,
* ఓం హేరంబాయ నమః,
* ఓం స్కందపూర్వజాయ నమః,
* ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,

🌸మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

🌸అగరవత్తులు వెలిగించి ధుపం చూపించవలెను.

🌸ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. కొద్దిగా బెల్లం ముక్కను నివేదన చేయాలి ఓం ప్రాణాయస్వాహా , ఓమ్ అపానాయస్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓమ్ ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీరు వదలాలి.

🌸తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మానాం పాపాత్మాం పాపా సంభవః త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు , పుష్పములు శిరస్సున ధరించవలెను. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.

శ్రీ అనఘాష్టమి వ్రత పూజా విధానము
"🌸 అదౌ కల్పోక్త ద్దేవతా ఆవాహనం , ప్రాణప్రతిష్టాపనం చ కరిష్యే " అని సంకల్పము చేసి.
అష్టదళ పద్మే ఈశాన్య దళే కలశే ఆణిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే నైరృతి దళే కలశే ప్రాప్తి దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దక్షిణ భాగస్థ దళే కలశే ఈశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దేవస్య వామ భాగస్థ దళే కలశే వశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పురస్తాద్దళే దళే కలశే మహిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలశే శ్రీమదనఘస్వామిన మావాహయామి స్థపయామి పూజయామి.
కర్ణికాయాం అనఘ స్వామినః పార్శ్వే శ్రీమతీం అనఘా దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.

ప్రాణప్రతిష్ఠా :
🌸ఈశాన్య మణీమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిధే |
ప్రాప్తినామని నైరృత్యాం ప్రాకామాఖ్యే నిలస్థలే |
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి |
కామవసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్ |
మహమ్ని పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః |
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ |
అనఘ శ్చానఘాదేవీ ప్రాణచేష్టా విరాజితౌ |
చరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ ||

🌸ఈశాన్యమున అణిముడును, ఆగ్నేయమున లఘివుడును, నైరుతి దిక్కున ప్రాప్తియు, వాయువ్యమున ప్రాకామ్యుడను, ఎడమ కుడి భాగములందు ఈశ్వితుడు వశ్వితుడును, వెనుక భాగమున అంగరక్షకుని వలె కామావసాయితయు, ముందు పాదముల దగ్గర మహిముడను, ఇట్లే ఎనిమిది దళముల ఎనిమిది మంది నిత్యము నిలచియుండగా ఆ దళముల మధ్యగల కర్ణిక యందు కొలువుదీర్చి యుండు గురు సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీ అనఘ దంపతులు ప్రాణములతోనూ, చేష్టలతోనూ ఒప్పుచూ, నా హృదయమున చరించుచుందురు గాక, అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః - సర్వెంద్రియాణి వాఙ్మనశ్చక్షు శ్శ్రోత జిహ్వ ఘ్రాణరేతో బుధ్యాదీని ఇహైవాగత్య సుఖంచిరంతిష్టంతు స్వాహా, ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు, స్థిరోభవ, వరదోభవ, స్థిరాసనం కురు.

🌸స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం |
తావత్త్వం ప్రీతిభావేన కుంభస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానమ్ :
🌸పద్మాసనోత్తాన మనోజ్ఞ పాదం పద్మం దధానం నభయంచ పాణ్యోః |
యోగ స్థిరం నిర్భర కాంతి పుంజం దత్తం ప్రపద్యే నఘ నామధేయం ||

🌸పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం పద్మం దధానా మభయంచ పాణ్యోః |
యోగేర్థ సమ్మీలిత విశ్చలాక్షీం దత్తాను రక్తా మనఘాం ప్రపద్యే ||

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ధ్యాయామి.
ఆవాహనమ్ :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆవాహయామి.

ఆసనమ్ :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి.

పాద్యం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః హస్త్యోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనమ్ :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతస్నానం:
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.

స్నానం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః స్నానం సమర్పయామి.

వస్త్రం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి.

ఉపవీతం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి.

గంధం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః గంధం ధారయామి ||
గంధోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి.
శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మంగళ ద్రవ్యాని సమర్పయామి.

ఆభరణం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆభరణాని సమర్పయామి.

పుష్పం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి.

కుంకుమపూజా :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః కుంకుమపూజాం సమర్పయామి.

అంగ పూజ :
🌸 అయ్యవారికి
* శ్రీ అనఘ దేవాయ నమః - పాదౌ పూజయామి.
* త్రిగత్సంచరాయ నమః - జంఘే పూజయామి.
* ఆజానుభాహవే నమః - జానునీ పూజయామి.
* పద్మాసన స్థాయ నమః - ఊరూ పూజయామి.
* త్రిగుణేశాయ నమః - వళిత్రయం పూజయామి.
* శాతోదరాయ నమః - ఉదరం పూజయామి.
* కరుణాకరాయ నమః - హృదయం పూజయామి.
* భక్తాలంబనాయ నమః - భాహూ పూజయామి.
* సంగీత రసికాయ నమః - కంఠం పూజయామి.
* జగన్మోహనాయ నమః - మందస్మితం పూజయామి.
* జగత్ప్రాణాయ నమః - నాసికాం పూజయామి.
* శ్రుతి సంవేద్యాయ నమః - శ్రోత్రే పూజయామి.
* ధ్యాన గోచరాయ నమః - నేత్రద్వయం పూజయామి.
* తిలకాంచిత ఫాలాయ నమః - ఫాలం పూజయామి.
* సహస్ర శీర్షాయ నమః - శిరః పూజయామి.
* సచ్చిదానందాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.

ఇచట అష్టోత్తర శతనామావళి చదువవలెను.
ధూపం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

దీపం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః దీపం దర్శయామి - దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

నైవేద్యం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం :
🌸ప్రభో సమస్తా త్పరివర్తితై శ్శ్రీ కర్పూర నీరాజన దీప మాల్యైః |
యుష్మ న్మహార్చిః పరివేష పంక్తిః కిమ్మీరితాభా స్త్వనఘే నషు ప్రభో ||

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణం :
🌸శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

ప్రార్థనమ్ :
🌸మనోవాక్కాయోత్థం క్షపితు మఘ మాత్మీయ వితతే
ర్థృతం నూనం యాభ్యాం విమల మిహ దాంపత్యలసనమ్ |
తయోః పాద ద్వంద్వం మహిమ ముఖ పుత్రాష్టక లస
త్పరీవారం వందే సతత మనఘాఖ్యా కలితయోః |

సమర్పణమ్ :
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||


* ఓం దత్తాత్రేయ నమః
* ఓం శ్రీ అనఘాయై నమః
* ఓం అనఘాయ నమః
* ఓం మహాదేవ్యై నమః
* ఓం త్రివిదాఘ నమః
* ఓం మహాలక్ష్మ్యై నమః
* ఓం లక్ష్మీ రూపాన ఘేశాయ నమః
* ఓం అనఘస్వామి పత్న్యై నమః
* ఓం యోగాధీశాయ నమః
* ఓం యోగేశాయై నమః
* ఓం ద్రాంబీజ ధ్యాన గమ్యాయ నమః
* ఓం త్రివిదాఘ విదారిణ్యై నమః
* ఓం విజ్ఞేయాయ నమః
* ఓం త్రిగుణాయై నమః
* ఓం గర్భాది తారణాయ నమః
* ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః
* ఓం దత్తాత్రేయాయ నమః
* ఓం సిద్ధ సేవ్య పదే నమః
* ఓం బీజస్థ వట తుల్యాయ నమః
* ఓం ఆత్రేయ గృహదీపాయై నమః
* ఓం ఏకార్ణ మను గామినే నమః
* ఓం వినీతాయై నమః
* ఓం షడర్ణ మను పాలయ నమః
* ఓం అనసూయా ప్రీతిదాయై నమః
* ఓం యోగ సంత్కరాయ నమః
* ఓం మనోజ్ఞాయై నమః
* ఓం అష్టార్ణమను గమ్యాయ నమః
* ఓం యోగశక్తి స్వరూపిణ్యై నమః
* ఓం పూర్ణానంద వపుష్మతే నమః
* ఓం యోగాతీత హృదే నమః
* ఓం ద్వాదశాక్షర మంత్రస్థాయ నమః
* ఓం చిత్రాసనోప విష్టాయై నమః
* ఓం ఆత్మసాయుజ్య దాయినే నమః
* ఓం షోడశార్ణ మను స్థాయ నమః
* ఓం రత్నాంగుళీయక లసత్పాదాం గుళ్యై నమః
* ఓం సచ్చిదానంద శాలినే నమః
* ఓం పద్మ గర్భోపమానాంఘ్రి తలాయై నమః
* ఓం భర్తృ శుశ్రూషణోత్కాయై నమః
* ఓం హరయే నమః
* ఓం మతిమత్యై నమః
* ఓం కృష్ణాయ నమః
* ఓం తాపసీవేష ధారిణ్యై నమః
* ఓం ఉన్మత్తాయ నమః
* ఓం తాపత్రయ నుదే నమః
* ఓం ఆనందదాయకాయ నమః
* ఓం హరిద్రాంచ త్ప్రపాదాయై నమః
* ఓం దిగంబరాయ నమః
* ఓం మంజీర కలజత్రవే నమః
* ఓం మునయే నమః
* ఓం శుచివల్కల ధారిణ్యై నమః
* ఓం బాలాయ నమః
* ఓం కాంచీదామ యుజే నమః
* ఓం పిశాచాయ నమః
* ఓం జ్ఞానసాగరాయ నమః
* ఓం గ్రైవేయాళీ ధృతే నమః
* ఓం ఆబ్రహ్మ జన్మదోషాఘ ప్రణశాయ నమః
* ఓం క్వణ ట్కంకణ యుక్తాయై నమః
* ఓం సర్వోపకారిణే నమః
* ఓం పుష్పాలంకృతాయే నమః
* ఓం మోక్షదాయినే నమః
* ఓం అభీతిముద్రా హస్తాయై నమః
* ఓం రూపిణే నమః
* ఓం లీలాంభోజ ధీతే నమః
* ఓం భగవతే నమః
* ఓం తాటంకయుగ దీప్తాయై నమః
* ఓం దత్తాత్రేయాయస్మృతిమాత్ర సుతుష్టాయ నమః
* ఓం నానారత్న సుదీప్తాయే నమః
* ఓం మహాభయ నివారిణే నమః
* ఓం ధ్యాన స్థిరాక్ష్యై నమః
* ఓం మహాజ్ఞాన ప్రదాయ నమః
* ఓం ఫాలామ్చత్తిలకాయై నమః
* ఓం చిదానందాత్మనే నమః
* ఓం మూర్ధాబద్ధ జటా రాజ త్సుమ దామాఅళయే నమః
* ఓం బాలోన్మత్త పిశాచాది వేషాయ నమః
* ఓం భర్తాజ్ఞా పాలనాయై నమః
* ఓం మహాయోగినే నమః
* ఓం నానావేష ధృతే నమః
* ఓం అవధూతాయ నమః
* ఓం పంచపర్వాన్వితా విద్యా రూపికాయై నమః
* ఓం అనసూయా నందనాయ నమః
* ఓం సర్వావరణ శీలాయై నమః
* ఓం అత్రిపుత్రాయ నమః
* ఓం స్వబలావృత వేధసే నమః
* ఓం సర్వకామ ఫలానీక ప్రదాత్రే నమః
* ఓం విష్ణుపత్న్యై నమః
* ఓం ప్రణవాక్షర వేదయాయ నమః
* ఓం వేద మాత్రే నమః
* ఓం భవబంధ విమోచినే నమః
* ఓం స్వచ్ఛ శంఖ ధృతే నమః
* ఓం హ్రీం బీజాక్షర పారాయ నమః
* ఓం మందహాస మనోజ్ఞాయై నమః
* ఓం సర్వైశ్వర్య ప్రదాయినే నమః
* ఓం మంత్రతత్వ విదే నమః
* ఓం క్రోబీజ జప తుష్టాయ నమః
* ఓం దత్తపార్శ్వ నివాసాయై నమః
* ఓం సాధ్యాకర్షణ దాయినే నమః
* ఓం రేణుకేష్ట కృతే నమః
* ఓం సౌర్బీజ ప్రీత మనసే నమః
* ఓం ముఖనిస్పృత శంపాభ త్రయీదీప్త్యై నమః
* ఓం మనస్సంక్షోభ కారిణే నమః
* ఓం విధాతృవేద సంధాత్ర్యై నమః
* ఓం ఐంబీజ పరితుష్టాయ నమః
* ఓం సృష్టి శక్త్యై నమః
* ఓం వాక్ప్రదాయ నమః
* ఓం శాంతి లక్ష్మ్యై నమః
* ఓం క్లీంబీజ సముపాస్యాయ నమః
* ఓం గాయకాయై నమః
* ఓం త్రిజగద్వశ్యకారిణే నమః
* ఓం బ్రాహ్మణ్యై నమః
* ఓం శ్రీ ముపాసన తుష్టాయ నమః
* ఓం యోగచర్యా రతాయై
* ఓం నర్తికాయై నమః
* ఓం మహా సంవత్ప్రదాయ నమః
* ఓం దత్తనామాంక సంస్థాయై నమః
* ఓం గ్లౌమక్షర సువేద్యాయ నమః
* ఓం జగదిష్ట కృతే నమః
* ఓం భూసామ్రాజ్య ప్రదాయినే నమః
* ఓం శుభాయై నమః
* ఓం ద్రాంబీజాక్షర వాసాయ నమః
* ఓం చారు సర్వాంగ్యై నమః
* ఓం మహతే నమః
* ఓం చంద్రాస్యాయై నమః
* ఓం చిరజీవినే నమః
* ఓం దుర్మానస క్షోభకర్యై నమః
* ఓం నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః
* ఓం సాధు హృచ్ఛాంతయే నమః
* ఓం సమస్త గుణసంపన్నాయ నమః
* ఓం సర్వాంత గతయే నమః
* ఓం అంతశ్శత్రు విదాహినే నమః
* ఓం పాద స్థితాయై నమః
* ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః
* ఓం పద్మాయై నమః
* ఓం సర్వవ్యాధి హరాయ నమః
* ఓం గృహదాయై నమః
* ఓం పరాభిచార శమనాయ నమః
* ఓం సక్తిస్థితాయై నమః
* ఓం ఆధి వ్యాధి నివారిణే నమః
* ఓం సద్రత్న వస్త్రదాయై నమః
* ఓం దుఃఖ త్రయ హరాయ నమః
* ఓం గుహ్య స్థాన స్థితాయై నమః
* ఓం దారిద్ర్య ద్రావిణే నమః
* ఓం పత్నీ దాయై నమః
* ఓం దేహ దార్ధ్యాభి పోషాయ నమః
* ఓం క్రోడ స్థాయై నమః
* ఓం చిత్త సంతోషకారిణే నమః
* ఓం పుత్రదాయై నమః
* ఓం సర్వమంత్ర స్వరూపాయ నమః
* ఓం వంశ వృద్ధికృతే నమః
* ఓం సర్వయంత్ర స్వరూపిణే నమః
* ఓం హృద్గతాయై నమః
* ఓం సర్వ తంత్రాత్మకాయ నమః
* ఓం సర్వకామ పూరణాయై నమః
* ఓం సర్వపల్లవ రూపిణే నమః
* ఓం కంఠ స్థితాయై నమః
* ఓం శివాయ నమః
* ఓం హారాది భూషా దాత్ర్యై నమః
* ఓం ఉపనిషద్వేద్యాయ నమః
* ఓం ప్రవా సిబంధు సంయోగ దాయికాయై నమః
* ఓం దత్తాయ నమః
* ఓం మిష్టాన్నదాయై నమః
* ఓం భగవతే నమః
* ఓం వాక్చక్తిదాయై నమః
* ఓం దత్తాత్రేయాయ నమః
* ఓం బ్రాహ్మ్యై నమః
* ఓం మహాగంభీర రూపాయ నమః
* ఓం అజ్ఞాబల ప్రదాత్యై నమః
* ఓం వైకుంఠ వాసినే నమః
* ఓం సదైశ్వర్య కృతే నమః
* ఓం శంఖ గదా శూల దారిణే నమః
* ఓం ముఖ స్థితాయై నమః
* ఓం వేణు నాదినే నమః
* ఓం కవితాశక్తిదాయై నమః
* ఓం దుష్ట సంహారకాయ నమః
* ఓం శిరోగతాయై నమః
* ఓం శిష్ట సంపాలకాయ నమః
* ఓం నిర్దాహ కర్యై నమః
* ఓం నారాయణాయ అస్త్రధరాయ నమః
* ఓం రౌద్ర్యై నమః
* ఓం చిద్రూపిణే నమః
* ఓం బంభాసుర విదాహిన్యై నమః
* ఓం ప్రజ్ఞారూపాయ నమః
* ఓం జంభ వంశ హృతే నమః
* ఓం ఆనంద రూపిణే నమః
* ఓం దత్తాంక సంస్థితాయై నమః
* ఓం బ్రహ్మ రూపిణే నమః
* ఓం వైష్ణవ్యై నమః
* ఓం మహావాక్య ప్రబోధాయ నమః
* ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః
* ఓం తత్వాయ నమః
* ఓం దేవప్రీతి కృతే నమః
* ఓం సకల కర్మౌషు నిర్మితాయ నమః
* ఓం నహుషాత్మజ దాత్ర్యై నమః
* ఓం సచ్చిదానంద రూపాయ నమః
* ఓం లోక మాత్రే నమః
* ఓం సకల లోకౌఘ సమ్చరాయ నమః
* ఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః
* ఓం సకల దేవౌఘ వశీకృతి కరాయ నమః
* ఓం కుటుంబ వృద్ధిదాయ నమః
* ఓం భార్గవ క్షిప్రతుష్టాయై నమః
* ఓం గుడపానక తోషిణే నమః
* ఓం కాలత్రయ విదే నమః
* ఓం పంచకర్జాయ సుప్రీతాయ నమః
* ఓం కార్తవీర్య ప్రసన్నాయై నమః
* ఓం కంద ఫలాదినే నమః
* ఓం సర్వసిద్ధికృతే నమః
* ఓం సద్గురవే నమః
* ఓం శ్రీ మద్దత్తాత్రేయాయ నమః
శ్రీ అనఘాష్టమి వ్రతకథ

మొదటి అధ్యాయము
🌸దీపకుడు ఈ విధంగా పలికెను: ఓ గురుదేవా ! పూర్వము జంభాసరుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించాడని నేను విన్నాను. మరి ఆయన యుద్ధము చేశాడా ? లేక తనకున్నయోగ బలము చేత గెలిచాడ ? తెలుసుకోవలయునని నాకు చాలా ఆసక్తిగా ఉన్నది. కావున నాయందు దయవుంచి ఆవిషయమును వివరించండి. శ్రీ గురువు ఈ విధంగా చెప్పసాగెను. నాయనా ! పూర్వము ధర్మరాజు యీ విషయమనే శ్రీ కృష్ణుని అడిగెను. ఆ విషయములను నీకు చెప్పెదను శ్రద్ధగా, ఏకాగ్రతతో వినుము.

శ్రీ కృష్ణుడు పలికెను :
🌸బ్రహ్మ పుత్రుడగు అత్రియను మహా తేజశాలియైన ఒక ఋషి కలడు. ఆయన భార్య అనసూయ. ఆమె గొప్ప పతివ్రత. వారికి చాలా కాలమునకు మహా తపస్వియు, మహా యోగియు అగు దత్తుడు అను కుమారుడు విష్ణ్వంశతో జన్మించెను. ఆ దత్తునకు యీ లోకమున సాటి లేదని ప్రసిద్ధి. ఆయనకు అనఘ అను సహధర్మచారిణియైన భార్య కలదు. ఆమెకు సంతానం ఎనిమిదిమంది కుమారులు. దయ గలది. ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది. ఆ అనఘుడు విష్ణువు అంశ, అనఘ లక్ష్మీ దేవి అంశ. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయుచున్న దత్తుని దగ్గరకు జంభాసరునిచే బాధింపబడిన దేవతలు వచ్చి శరణు కోరినారు. బ్రహ్మ యిచ్చిన వరముచే ఆ జంభాసరుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరముల పాటు యుద్ధము చేసెను. ఆ దేవ దానవ యుద్దమున పాతాళము నుండి ద్వైత్య దానవ రాక్షస జాతుల వారు వచ్చి యుద్ధము. చివరకు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదలి దిక్కులకు పరుగులు పెట్టిరి. దేవతలిట్లు గతిలేక పరుగులు పెట్టుచుండగా జంభుడు మున్నగు రాక్షసులు వెంటబడి తరుముచుండిరి. రాక్షసులు బాణములతోనూ, గదలతోనూ, రోకళ్ళతోనూ, యుద్ధము చేయసాగిరి. వారిలో కొందరు ఎద్దులను, కొందరు దున్నపోతులను, కొందరు శరభములను, గండకములను పులులను, కోతులను, గాడిదలను ఎక్కి, రాళ్ళు విసురుచూ, ఫిరంగులు పేల్చుతూ, తోమరములు బాణములు మొదలైనవి వేయుచూ వెంటపడిరి. వారు అట్లు అనఘ దంపతులు నివసించుచుండు ఆశ్రమము గల వింధ్య పర్వతము వరకు వచ్చిరి. ఆ దేవతలు శరణార్థులై అనఘ దంపతుల దగ్గరకు చేరిరి.

దేవతలు పలికిరి :
🌸దేవదేవ ! జగన్నాధ! శంకచక్ర గదాధర ! జంభ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణు జొచ్చిన మమ్ము కాపాడుము. ఓ బ్రహ్మర్షీ ! నీ భక్తులగు దేవతలకు నీ పాద పద్మముల కన్న వేరు గతిలేదు. కాన నిన్నాశ్రయించిన మమ్ము రక్షించుము. ఆ అనఘ భగవానుడు వారల యేడ్పును విని అనఘాదేవికి విలాసముగా సంజ్ఞ చేసెను. పిమ్మట ఆ దేవత లందరని ఆశ్రమము లోనికి పంపి, మీరు యిచ్చట నిర్భయముగా ఉండునని పలికెను. వారునూ అంగీకరించి తృప్తిగా ఉండిరి. అంతలో రాక్షసులనూ ఆయుదములు విసురు కొనుచూ అచ్చటికి వచ్చి విలాసవతి ఆకారములో నున్న అనఘాదేవిని చూసి " యీ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకొనుడు, పూలు, పండ్లు మొదలగు కానుకలు యిండు " అని పల్కిరి. అంతలో వారి ఐశ్వర్యలక్ష్మి వారి నెత్తికెక్కును. దత్తుడునూ, వారిని తన ధ్యానాగ్ని నేత్రముచే చూడగా క్షణములో వారు కాలి పోయిరి. ఇంతలో రాక్శసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకొని వెళ్ళసాగిరి. దత్త ప్రభావముచే, తేజోహీనులునూ, అనఘాదేవి ప్రభావముచే లక్ష్మీ హీనులునూ అగు ఆ మద పీడితులగు ఆ రాక్షసులను దేవతలు పట్టి నరుకాగిరి. 25, 26. రిష్టులు, కరణములు, శ్లములు, పిరిఘలు, త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలిట్లు తమ్ము నరకు చుండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడ్పులూ, పెడబొబ్బలూ సాగించిరి. ఇట్లు ఆ దత్తప్రభావము వల్ల రాక్షసులు దేవతల శస్త్రములచే నశించిరి. జంభాసురుడునూ ఇంద్రుని చేత మరణించెను. దేవతలు మునుపటి వలె తమ రాజ్యములను పొందిరి. ఇట్లు దేవతలంతటి వారే దేవర్షియగు ఆ దత్తుని మహిమను అనుభవించిరి.

 

5

ఆంజనేయ స్తోత్రమ్



ఆంజనేయ స్తోత్రమ్
🌸రంరంరం రక్త వర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం రంరంరం రమ్య తేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం
రంరంరం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి.

🌸ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖంఖంఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయామాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి.

🌸ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజవసదయం ఆర్యపూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం.
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి.

🌸సం సం సం సాక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వ స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి

🌸హం హం హం హంసరూపం స్పుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయం రమ్యగంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్థ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకల దిశయశం రామదూతం సమామి.

🙏జై హనుమాన్🙏
6

అష్ట దిక్పాలకులు
 

ఇంద్రుడు - తూర్పు దిక్కు

ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

అగ్ని - ఆగ్నేయ మూల
ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.

యముడు - దక్షిణ దిక్కు
ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

నైఋతి - నైఋతి మూల
ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

వరుణుడు - పడమర దిక్కు
ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.

వాయువు - వాయువ్య మూల
ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

కుబేరుడు - ఉత్తర దిక్కు
ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

ఈశాన్యుడు - ఈశాన్య మూల
ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.

7

జన్మ నక్షత్రం పారాయణం చెయ్యవలసిన నక్షత్ర గాయత్రీ మంత్రములు



జన్మ నక్షత్ర, నామ నక్షత్ర, గోచార రీత్యా గ్రహ దోషములు తొలగూటకు నక్షత్ర గాయత్రిని రోజుకు 21 సార్లు పారాయణం .ఆ నక్షత్ర జాతకులు తమ నక్షత్రమున్న రోజున 108 సార్లు పారాయణం చెయ్యాలి

1.అశ్విని నక్షత్రం వారు

ఓం శ్వేతవర్ణై విద్మహే

సుధాకరాయై ధిమహి

తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి నక్షత్రం వారు

ఓం కృష్ణవర్ణై విద్మహే

దండధరాయై ధిమహి

తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తిక నక్షత్రం వారు

ఓం వణ్ణిదేహాయై విద్మహే

మహాతపాయై ధీమహి

తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి నక్షత్రం వారు

ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే

విశ్వరూపాయై ధీమహి

తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిర నక్షత్రం వారు

ఓం శశిశేఖరాయ విద్మహే

మహారాజాయ ధిమహి

తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆరుద్ర నక్షత్రం వారు

ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే

పశుం తనాయ ధిమహి

తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు నక్షత్రం వారు

ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే

అదితి పుత్రాయ ధిమహి

తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్యమి నక్షత్రం వారు

ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే

మహాదిశాయాయ ధిమహి

తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష నక్షత్రం వారు

ఓం సర్పరాజాయ విద్మహే

మహారోచకాయ ధిమహి

తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ నక్షత్రం వారు

ఓం మహా అనగాయ విద్మహే

పిత్రియాదేవాయ ధిమహి

తన్నో మఖ: ప్రచోదయాత్

1.పుబ్బ నక్షత్రం వారు

ఓం అరియంనాయ విద్మహే

పశుదేహాయ ధిమహి

తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తర నక్షత్రం వారు

మహాబకాయై విద్మహే

మహాశ్రేష్ఠాయై ధీమహి

తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త నక్షత్రం వారు

ఓం ప్రయచ్చతాయై విద్మహే

ప్రకృప్రణీతాయై ధీమహి

తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్త నక్షత్రం వారు

ఓం మహాదృష్టాయై విద్మహే

ప్రజారపాయై ధీమహి

తన్నో చిత్తా:ప్రచోదయాత్

15.స్వాతి నక్షత్రం వారు

ఓం కామసారాయై విద్మహే

మహాని ష్ఠాయై ధీమహి

తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ నక్షత్రం వారు

ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే

మహాశ్రేష్ఠాయై చ ధీమహీ

తన్నో విశాఖ ప్రచోదయాత్

17.అనూరాధ నక్షత్రం వారు

ఓం మిత్రదేయాయై విద్మహే

మహామిత్రాయ ధీమహి

తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠ నక్షత్రం వారు

ఓం జ్యేష్ఠాయై విద్మహే

మహాజ్యేష్ఠాయై ధీమహి

తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల నక్షత్రం వారు

ఓం ప్రజాధిపాయై విద్మహే

మహాప్రజాధిపాయై ధీమహి

తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ నక్షత్రం వారు

ఓం సముద్ర కామాయై విద్మహే

మహాబీజితాయై ధిమహి

తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ నక్షత్రం వారు

ఓం విశ్వేదేవాయ విద్మహే

మహాషాఢాయ ధిమహి

తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22.శ్రవణ నక్షత్రం వారు

ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే

పుణ్యశ్లోకాయ ధీమహి

తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠ నక్షత్రం వారు

ఓం అగ్రనాథాయ విద్మహే

వసూప్రితాయ ధీమహి

తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషంనక్షత్రం వారు

ఓం భేషజాయ విద్మహే

వరుణదేహాయ ధీమహి

తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర నక్షత్రం వారు

ఓం తేజస్కరాయ విద్మహే

అజరక పాదాయ ధీమహి

తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర నక్షత్రం వారు

ఓం అహిరబుధ్నాయ విద్మహే

ప్రతిష్ఠాపనాయ ధీమహి

తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి నక్షత్రం వారు

ఓం విశ్వరూపాయ విద్మహే

పూష్ణ దేహాయ ధీమహి

తన్నో రేవతి ప్రచోదయాత్

 

8

జన్మ నక్షత్రము - నాటాల్సిన వృక్షములు



జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచి పూజించితే ఆ వృక్షం పెద్దయ్యే కొద్దీ శుభాలను కలగచేస్తుంది .

అశ్వని నక్షత్రము -జీడీ లేదా విషముష్టి చెట్టు

విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి,వీటిని పూజించడం వలన . జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.

భరణి నక్షత్రము - ఉసిరి చెట్టు

ఉసిరి చెట్టు పెంచడం వలన జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. వృత్తిపరంగా ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది

కృత్తిక నక్షత్రము -అత్తి / మేడి చెట్టు

అత్తి / మేడి చెట్టును పెంచడం వలన పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది . అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి ఇస్తుంది .

రోహిణి నక్షత్రము - నేరేడు చెట్టు

నేరేడు చెట్టుని పెంచి పూజించడం వలన చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయానికి వృత్తి ఉద్యోగాలకు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది

మృగశిర నక్షత్రము- మారేడు, చండ్ర చెట్టు

మారేడు, చండ్ర చెట్టుని పెంచి పూజించటం వలన గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు . ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన సమస్యల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రము-చింత చెట్టు

చింత చెట్టుని పెంచి పూజించడం వలన గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు కలువు . వీరి మనసును అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

పునర్వసు నక్షత్రము -వెదురు లేదా గన్నేరు చెట్టు

వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించుట వలన . ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదు .

పుష్యమి నక్షత్రము-రావి లేదా పిప్పిలి చెట్టు

రావి లేదా పిప్పిలి చెట్టు పెంచి పూజించడం వలన . నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. గుప్త శత్రువుల సమస్యల నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన పరమైన సమస్యలు తగ్గుతాయి

ఆశ్లేష నక్షత్రము -సంపంగి లేదా చంపక వృక్షం

సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించటం వలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రము-మర్రి చెట్టు

మర్రి చెట్టుని పెంచి పూజించడం వలన ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యతకు , తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. చేపట్టిన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రము-మోదుగ చెట్టు

మోదుగ చెట్టుని పెంచి పూజించుట వలన సంతానలేమి సమస్య తెలుగు తాయి . అలాగే మంచి సౌందర్యం కూడా పొందవచ్చు . ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రము-జువ్వి చెట్టు

జువ్వి చెట్టుని పెంచి పూజించుట వలన హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను నీ మాట మీదకు తీసుకు రావడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రము-సన్నజాజి, కుంకుడు చెట్టు

సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచి పూజించడం వలన . ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటిలోను విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రము -మారేడు లేదా తాళ వృక్షం

మారేడు లేదా తాళ చెట్టును పెంచి పూజించడం వలన . పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరుల నుండి కలిగే సమస్యలు చాకచక్యం పరిష్కరించుకోవచ్చు .

స్వాతి నక్షత్రము-మద్ది చెట్టు

మద్ది చెట్టును పెంచి పూజించడం వలన స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి . అన్ని విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి సహాయపడుతుంది .

విశాఖ నక్షత్రము-వెలగ, మొగలి చెట్లు

వెలగ, మొగలి చెట్లను పెంచి పూజించడం వలన . జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలలో విజయం సాధించడానికి.వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రము-పొగడ చెట్టు

పొగడ చెట్టుని పెంచి పూజించడం వలన కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, ఇతరులకు సహాయం చెయ్యడానికి , విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రము-విష్టి చెట్టు

విష్టి చెట్టుని పెంచి పూజించడం వలన కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ప్రతి వ్యవహారంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది

మూల నక్షత్రము-వేగి చెట్టు

వేగి చెట్టుని పెంచి పూజించడం వలన పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు నుండి ఉపశమనం కలుగుతుంది . కేశ సంభంధిత సమస్యలు కూడా తొలగుతాయి

పూర్వాషాడ నక్షత్రము-నిమ్మ లేదా అశోక వృక్షం

నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించడం వలన . కీళ్ళు, వ్రణములు వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఉత్తరాషాడ నక్షత్రము -పనస చెట్టు

పనస చెట్టుని పెంచి పూజించాలి . దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు తొలగి మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రము-జిల్లేడు చెట్టు

జిల్లేడు చెట్టును పెంచి పూజించడం వలన . మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. సత్య ప్రవర్తనతో మెలగడానికి . పనులందు కార్యసిద్ధికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రము-జమ్మి చెట్టు

జమ్మి చెట్టును పెంచి పూజించడం వలన . మెదడుకి సంబంధించిన సమస్యలు తొలగుతాయి . అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రము-కడిమి చెట్టు లేదా అరటి చెట్టు

కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజిండం వలన . శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము-మామిడి చెట్టు

మామిడి చెట్టుని పెంచి పూజించడం వలన కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. అన్ని రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశీ నివాసనికి ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రము-వేప చెట్టు

వేప చెట్టుని పెంచి పూజించడం వలన . శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు పొందడానికి , వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు సహాయపడుతుంది .

రేవతి నక్షత్రము-విప్ప చెట్టు

విప్ప చెట్టుని పెంచి పూజించడం వలన . థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వ్యాపారాలలో నైపుణ్యం , కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు పొందడానికి ఉపయోగపడుతుంది.

 

9

పిల్లి శకునాలు
 

🐺 ప్రయాణమై పోవునపుడు పిల్లి ఎదురు వచ్చినను, అడ్డముగా వెళ్ళినను కార్య విఫలమగును.

🐺 పిల్లులు పోట్లడుకొనుచు ఎదురుగా వచ్చిన కలహం సంబం వించును.

🐺 ఎలుకను నోట కరుచుకొని ఎదురుగా వచ్చిన తల పెట్టిన పనులు, కార్యములు జయం అగును.

🐺 పిల్లి ముఖము తుడుచుకునుచు ఎదురు పడిన సంతోషం కలుగును.

Note:

📢 మనుషులు పూర్వపు రోజులలో తన కంటే చిన్నవి లేదా నేర్చుకునే జ్ఞానం కలవాటిని అయిన జంతవులను తనకు ఉపయోగకరంగా వుండేందుకు పెంచుకుని తన అవసరాలకు వాడేకునేవాడు. ఈ నాటి కాలంలో Cat Family అన బడే పులులు,చిరుతలు,అడవిపిల్లులు ఇంకా ఇతర క్రూర మృగాలు. అడవులలో నివసించేవి.ఆ నాటి కాలంలో ఒక ఊరి నుండి మరొక వూరికి పోవలంటే గుర్రాలు,గుర్రపు రథాలు లేదా ఎడ్ల బండి మీద ప్రయాణాలు చేసేవారు అటువంటి కొన్ని సందర్బాలలో తప్పని సరిగా అడవి మార్గం గుండా ప్రయాణం చేయాల్సివచ్చేది రాత్రుల్లో ఈ క్యాట్ ఫ్యామిలికి చెందిన పులులు,చిరుతలు ఎదురు పడినప్పుడు వాటి కళ్ళు మాత్రం జ్యోతుల్ల వెలిగి వాటి వునికిని తెలిపేవి అప్పుడు ఎడ్లు వాటి కళ్లను చూసి బయపడి ఆగిపోయేవి ప్రయాణానికి అంతరాయం, ప్రమాదం అవ్వడంతో ఆ జంతువులు ఎదురు పడటం ఆశుభంగా భావించే వారు ఆ విధంగా పిల్లిని కూడా అశుభం గా బావించే వారు.అదే ఆధారాన్ని మూలన్ని మర్చిపోయి వుళ్ళల్లో ఇల్లులో వీధుల్లో ఎదురు పడే చిన్న సాదు జంతువులు అయిన పిల్లులు ఎదురు పడటం కూడా అశుభంగా భావిస్తున్నం.

 

10

చంద్రకాంత మణి

చంద్రకాంత మణి రత్నధారణ విశేషాలు

🌸చంద్రుడు జల గ్రహం. నీటిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు. సముద్రంలో ఆటుపోటులకు చంద్రుడే కారకుడు. అందుకే అమావాస్య, పౌర్ణమి రోజులలో సముద్రం ఆటుపోట్లకు లోనై ఒకొక్కసారి తుఫాన్ లకు దారి తీస్తుంది. చంద్రుడు మానవ శరీరం లోని రక్తంపై అధిక ప్రభావం కలిగి ఉంటాడు. మన శరీరం అధికభాగం రక్తంతో కూడుకొని ఉంటుంది.

🌸జాతక చక్రంలో చంద్రుడు నీచ లోవున్న,శత్రు క్షేత్రాలలో వున్న, అమావాస్య, పౌర్ణమి రోజులలో జన్మించిన వ్యక్తులపై పెద్ద వాళ్ళ దృష్టి లేకపోతే చంచలమైన స్వభావంతో చెడ్డ పనులకు అలవాటు పడతారు. కాబట్టి అలాంటి వారిపై పెద్దవాళ్ళ దృష్టి ఉండటమే కాకుండా సరియైన వాతావరణంలో పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాతకచక్రంలో చంద్రుడు అష్టమంలో వుంటే బాలారిష్ట దోషం ఉంటుంది.

🌸చంద్రుడు కేంద్ర స్ధానాలలో బలంగా ఉంటాడు. చతుర్ధంలో చంద్రుడు ఉంటే ఆలోచనాశక్తి కలిగి ఉంటాడు. మానసిక ద్రుడత్వాన్ని కలిగిస్తాడు. చంద్రుడు బలహీనపడితే అనవసర భయాలను కలిగిస్తాడు. చంద్రగ్రహ దోషం ఉన్నవారికి ఎడమకన్ను లోపం ఉంటుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే తల్లి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు బాల్య దశలోనే చెడు ఫలితాలను ఇస్తాడు. చంచల స్వభావాలను కలిగిస్తాడు. అతిశీఘ్రగతికి కారకుడైన చంద్రుడు బలహీనంగా ఉంటే పనులలో ఆటంకాలు కలిగిస్తాడు. మతిమరుపు కలిగిస్తాడు.

🌸చంద్రునిపై శుక్రదృష్టి ఉన్న సంగీతం, కళలు, ఆనందం పెంపొందించే ఆటపాటల యందు అనురక్తి కలిగి ఉంటారు. అదే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కళలలో రాణింపు ఉండదు. స్తీల జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉండదు. చంద్రుడు, శని కలయిక లేదా సమసప్తకాలలో ఉన్న ద్వికళత్ర యోగానికి దారిటీసే అవకాశాలు ఉన్నాయి.

🌸చంద్రుడు బలహీనంగా ఉన్న కొన్నాళ్ళు ధైర్యంగా, కొన్నాళ్ళు పిరికితనంగా ఉంటారు. చంద్రుడు బలహీనంగా ఉన్న చంద్రకాంత మణిశిలను ఉంగరంగా గాని, లాకెట్ గాని ధరించటం మంచిది.

 

11

దివ్యాంగుల శ్లోకము


దివ్యాంగుల శ్లోకము
"సర్వథా క్రియతాం యత్నః సీతామధి గమిష్యథ
పక్షలాభో మమాయం వః సిద్ధి ప్రత్యయకారకః"


🌸ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తిని అమృత శక్తి అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు, చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, మంచం మీద నుంచి లేవలేకపోయినా, బాగా కఫం పేరుకుపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం మూడు సార్లు, మధ్యాహ్నం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు చప్పున చదివితే మంచి అవయవ లాభం. కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీని వలన బాగుపడిన వాళ్ళు ఉన్నారు.

🌸సంపాతి సీతాదేవి గురించి చెప్పాడు "మీరు వెళ్ళండి, ఆవిడ దొరికుతుంది" అని. అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎఱ్ఱగా రెక్కలు వచ్చేసాయి. అద్భుతంగా రెక్కలు వచ్చాయి. మంచి బలమైన రెక్కలు వచ్చాయి. రాముడి గురించి, సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించినా, వారికి ఉపకారం చేయాలనుకున్నా, వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి. మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఎగిరి పోయాడు. ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు. ఈ మంత్రం మహా మంత్రం. ప్రేమ మంత్రం. చాలా పవిత్రమైన మంత్రం.

🌸ఇందులో మొదటి అక్షరం 'స' అనేది సీతాదేవికి సంబంధించిన బీజం. తత్సవితుర్వరేణ్యంలో బీజం. అందులో ‘త్నః’ అనేది వికలాంగులను బాగు చేసేటటువంటి ధన్వంతరీ మంత్రం. 'సి' అనే మంత్రం బుద్ధి జ్ఞానాన్ని పెంచే మంత్రం. ‘ప’ కారము ఉత్సాహాన్ని పెంచే మంత్రం. ఈ బీజములను కలిపి ఈ శ్లోకములో పెట్టారు. అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు ఈ శ్లోకాన్ని రోజూ మూడు పూటలా మూడేసి సార్లు చదివేవారు. వైద్యుడు మందుని నారాయణ స్మరణ పూర్వకంగా ఇస్తే, మనం నారాయణ స్మరణ పూర్వకంగా వేసుకుంటే వెంటనే ఆరోగ్యం త్వరగా లభిస్తుంది. ఈ గొప్ప శ్లోకం భక్తులందరినీ రక్షిస్తుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా మూడు పూట్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు అంటే మొత్తం తొమ్మిది సార్లు నమ్మి చేసుకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది.

బలం గురోః ప్రవర్ధతాం

12

దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రము

🌸ఎవరైనా అమితమైన కష్టాలను అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. అందరికీ దర్శనభాగ్యం కలగాలి.

🌸దుర్గతులను భస్మం చేసే మహా శక్తివంతమైన దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రము.

🌸ఈ స్తోత్రము చాలా శక్తిమంతమయినది.

🌸దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి. ఈ స్తోత్రం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది. ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు. అందరూ తప్పకుండా నమ్మకం తో చదవండి.

దుర్గా ద్వాత్రింశన్నామ మాలాః స్తోత్రం

🌸దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ

🌸దుర్గతోర్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
దుర్గమ జ్ఞానదా దుర్గదైత్యలోక దావానలా

🌸దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మ స్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాశ్రితా

🌸దుర్గమా జ్ఞాన సంస్థాన దుర్గమ ధ్యానవాసినీ
దుర్గ మోహా దుర్గమగా దుర్గమార్ధ స్వరూపిణీ హి

🌸దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధ ధారిణీ
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ

🌸దుర్గభీమా దుర్గ భామా దుర్గభా దుర్గధారిణీ
నామావళి మియాంయస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

 

13

అష్ట దిక్కుల ప్రాధాన్యత!
 

మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.

దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.

విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.

1.) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి.

2.) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంబదించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.

3.) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

4.) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం.

5.) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.

6.) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.

7.) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.

8.)ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము (ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది. ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.

*ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

 

14

దుష్టపీడలను నివారించే నృసింహాష్టకం


దుష్టపీడలను నివారించే నృసింహాష్టకం
నృసింహాష్టకం

🌺 శ్రీ మదకలఙ్క పరిపూర్ణ శశికోటి, శ్రీధరమనోహర సటాపటల కాంత !
పాలయ కృపాలయ భవాంభుధి నిమగ్నం, దైత్యపరకాల నరసింహ నరసింహ ||

🌺 పాదకమలావనిత పాతజనానాం, పాతక దవానాల ప్తత్రత్త్రి వర కేతో |
భావనపరాయణ భవార్తిహం మాం, పాహి కృపయైవ నరసింహ నరసింహ | |

🌺 తుఞ్గ్నఖపజిత్కి దలితాసురవరాసృక్, పఙ్కనవకుఙుకమ విపఙ్కల మహోరః |
పణ్డితనిధాన కమలాలయ నమస్తే, పఙ్కజనిషణ్ణ! నరసింహ నరసింహ | |

🌺 మౌలిఘ విభూషణమివామరవరాణాం, యోగిహృదయేషు చ శిరస్సు నిగమానాం |
రాజదరవిందరుచిరం పదయుగం తే, దేహి మమమూర్డ్న నరసింహ నరసింహ | |

🌺 వారిజవిలోచన మదంతిమ దశాయాం, క్లేశవివశీకృత సమస్త కరుణాయాం |
ఏహి రమయా సహ శరణ్య విహగానాం, నాధ మధిరుహ్య నరసింహ నరసింహ | |

🌺 హాటకకిరీట వరహార వనమాలా, తారరశనా మకరకుణ్డ్లమణీంద్రై |
భూషితమశేషనిలయం తవ వపుర్మే, చేతసి చకాస్తు నరసింహ !నరసింహ | |

🌺 ఇందు రవి పావక విలోచన రమయా, మందిర మహాభుజ లసద్వర వరాఙ్గ |
సుందర చిరాయ రమతాం త్వయి మనోమే, నందిత సురేశ నరసింహ నరసింహ | |

🌺 మాధవ ముకుంద మధుసూధన మురారే, వామన నృసింహ శరణం భవ నతానాం |
కామద ఘృణిన్ నిఖిలకారణ మమేయం, కాల మమరేశ !నరసింహ నరసింహ | |

🌺 అష్టకమిదం సకల - పాతక - భయఘ్నం
కామదం అశేష - దురితామయ - రిపుఘ్నమ్ |
యః పఠతి సంతతమశేష - నిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ ||

 

15

జ్ఞాన సిద్దికి జన్మరాశుల స్తోత్రాలు


జ్ఞాన సిద్దికి జన్మరాశుల వారు నిత్యపారాయణ చేయవలసిన స్తోత్రాలు.!

మేష రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయై నమః

🌸ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్దా పరమేశ్వరు
మూల ప్రకృతి రావ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ !!


🌸చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా !
గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా!!

🌸సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా!
సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ!!


🌸నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః!
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ !!

వృషభ రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః

🌸కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా
వరదావామనయనా వారుణీ మదవిహ్వాలా !!


🌸కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ!
సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా!!

🌸దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ!
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ!!


🌸కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే!
వృతప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోస్తుతే!!

మిథున రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః

🌸నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా!
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా!!


🌸శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా!
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా!!

🌸సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా!
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ!!


🌸యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః!!

కర్కాటక రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం విదాత్ర్యైనమః

🌸బాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా!
రోగపర్వతదంభోళి ర్మ్రుత్యుదారుకుఠారికా!!


🌸ముకుందా ముక్తినిలయా మూలవిగ్రరూపిణీ!
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రపర్తినీ!!

🌸పంచమే పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ!
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ!!


🌸లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్ఠి స్వధే ధ్రువే!
మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తతే!!

సింహ రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః

🌸స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా!!


🌸ధర్మాధరా ధనాధ్యక్షా ధనధాన్య వివర్థినీ!
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ!!

🌸బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ!
సుమంగళీ సుఖకరీ సువేషాడ్యా సువాసినీ!!


🌸మేధే సరస్వతీ వారే భూతి భాభ్రవి తామసి!
నియతే త్వం ప్రసీదే నారాయణి నమోస్తుతే!!

కన్య రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వరై నమః

🌸భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ!
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ!!


🌸రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా!
రంజనీ రమణీ రస్యా రణత్మింకిణీమేఖలా!!

🌸వజ్రేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ!!
విశుద్ది చక్ర నిలయా రక్త వర్ణా త్రిలోచనా..!!


🌸సర్వస్య బుద్ధిరూపేణ జ్ఞానస్య హృది సంస్థితే!
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే!!

తులా రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం సిద్దేశ్వర్యై నమః

🌸అనాహతాబ్జనిలయా శ్యామభా వదసద్వయా!
దంష్ట్రోజ్వలా క్షమాలాదిధరా రుధిరసంస్థితా!!


🌸మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా!
మహానీయా దయామూర్తి సామ్రాజ్యశాలినీ !!

🌸అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా!
యోగినే యోగదా యోగ్యా యోగానందా యుగంధరా!!


🌸ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్!
పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే!!

వృశ్చిక రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమః

🌸కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా!
తాటంకయుగళీభూత తపనోడుపమండలా!!


🌸మహాపద్మాటవీసంస్థా కడంబవనవాసినీ!
సుదాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ!!

🌸నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా!
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా!!


🌸సృష్టిస్థితి వినాశనాం శక్తిభూతే సనాతని!
గణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే!!

ధనస్సు రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమః

🌸ఆరుణారుణకౌసుంభవస్త్ర బాస్వత్కటీతటీ!
రత్నకింకిణికారంయరశనాదామభూషితా!!


🌸ఆజ్ఞాచక్రాంతరళస్థా రుద్రగ్రంథివిభేదినీ!
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ!!

🌸సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా!
సర్వేశ్వరీ సర్వమాయీ సర్వమంత్రస్వరూపిణీ!!


🌸శరణాగత దీనార్తపరిత్రాణ పరాయణే!
సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే!!

మకర రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం చంద్రనిభాయై నమః

🌸మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా!
మహాబుద్ది ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ!!


🌸శృతిసీమంతసింధూరీ కృతపాదాబ్జధూళికా!
సకలాగమసందోహశుక్తి సంపుటమౌక్తికా!!

🌸విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా!
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమన్డలవాసినీ!!


🌸యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!

కుంభ రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం శుభాకర్యై నమః

🌸నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా!
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా!!


🌸నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా!
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామానిరుపప్లవా!!

🌸చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా!
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా!!


🌸సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే!
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గేదేవి నమోస్తుతే!!

మీన రాశి :
🌸ఓం ఐం హ్రీం శ్రీం సుధాసృత్యై నమః

🌸నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా!
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా!!


🌸మహేశ్వరమహాకల్ప మహాతాండవసాక్షిణీ!
మహాకామేశమహిషీ మహాత్రిపుర సుందరీ!!

🌸సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ!
స్వాహా స్వదా మతి ర్మేధా శృతిః స్మృతి రనుత్తమా!!

 

16

గోమేదికం
 

రాహుగ్రహ దోష నివారణకు "గోమేదికం"రత్న ధారణ విషయాలు
🌸(విదేశీ యోగం కలగాలి అనుకునే వారు ధరించిన అద్భుత ఫలితం ఇవ్వగలిగిన రత్నం)

🌸ఆవు మొక్క మేదస్సును పోలి ఉండును కనుక దీనిని గోమేధికం అంటారు. గోమేధికాన్ని గోమేధ అని, పింగస్ పధిక్, త్రినాపర్, పిస్పి, హజార్ యామిని, రాహురత్నఅని పిలుస్తారు. గోమేధికం గోమూత్రపు రంగును కలగి ఉంటుంది. గోమేధికం గోమూత్రం రంగులోను, తేనె రంగులోను లభ్యమగును. కొన్ని తెలుపు రంగులో ఉండి మెరుస్తూ ఉండును. గోమేధికం కంకర రాళ్ళలో, నదీ ప్రవాహములలో కొట్టుకొని వస్తుంటాయి.

🌸గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, పచ్చలు స్ఫటిక జాతికి చెందిన రత్నములు. గోమేధికం వజ్రము వలె కఠినముగా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం కలిగిన గోమేధికాలు తెల్లని కాంతితో, క్షత్రియ వర్ణం కలిగిన ఎరుపు రంగు మిశ్రమంతో, వైశ్య వర్ణం కలగిన ఆకుపచ్చ, పసుపు రంగుల్లో, శూద్ర వర్ణం కలిగిన నలుపు రంగులో మిశ్రమంగా కనిపించును.

🌸మచ్చలు, చారలు, కాంతిహీనం గలవి ధరించరాదు. వాటిలో గల దోషములలో మలినముగా, కాంతిహీనంగా ఉన్న“మలదోషం” ఉన్న వాటిని, మచ్చలు గల బిందుదోషం ఉన్న వాటిని, చారలు, గీతలు ఉన్న “రేఖ దోషం” ఉన్న వాటిని, బీటలు, ముక్కలుగా విరిగిన దోషమున్న “త్రాళ” దోషమున్న వాటిని, కాకి పాదం వంటి “కాక పాదం” దోషం ఉన్న వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవించగలవు.

🌸గోమేధికాలు హిమాలయ పర్వతాలలోను, శ్రీలంక ప్రాంతములలో లభ్యమగును. సూర్యకాంత గోమేధికం సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్నిజ్వాల వలె కనిపిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతములలో లభ్యమగు చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించిన పౌర్ణమి చంద్రుని వలె తెల్లగాను, మంచువలె చల్లగా, ప్రకాశవంతంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి, ఒకవైపు నుండి చూచిన రెండోవైపు కనపడేవి శ్రేష్ఠమైనవి.

🌸ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమేధికాన్ని గోమూత్రం లేదా గుర్రపు మూత్రంలో 72 గంటలు నానబెట్టి శుద్ధిచేసి, తదుపరి నల్ల ఉమ్మెత్త రసంలో ఒకరోజు అంతా ఉంచి కొలిమిలో భస్మం చేసిన దానిని స్వీకరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలగు వ్యాధుల నుండి విముక్తి కలుగును. రసాయనశాస్త్రం ప్రకారం బేరీలియమ్, జిర్కోనియం ఆక్సైడ్ ల రసాయన సమ్మేళనమే గోమేధికం.

గోమేదికం ధరించటం వలన కలుగు ప్రయోజనాలు:-
🌸గోమేధికమునకు అధిపతి రాహువు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారు, రాహు మహాదశ, అంతర్దశ జరుగుతున్న వాళ్ళు గోమేదికం దరించటం మంచిది. భూత ప్రేత పిశాచముల భాదలు అనుభవించుచున్నప్పుడు ఉంగరంలో గోమేదికం ధరించిన భాదల నుండి విముక్తి కలుగుతుంది. గోమేదికం ధరించిన సర్వజన వశీకరణ కలుగును. శత్రువులు మిత్రులుగా మారుదురు. స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగును. రోగములు కలగకుండా కాపాడగలదు. విదేశీవిద్యలలో రాణించటానికి విదేశీ వ్యాపారాలు అనుకూలించటానికి, విదేశాలలో ధనార్జనకు ఉత్తమమైన రత్నం గోమేదికం.

🌸రాహువు జాతకచక్రంలో లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, రాహువు జన్మజాతకంలో గాని గోచారంలో గాని పంచమం, నవమంలో ఉన్న, రాహుదశలోను కలహాలు, ఆస్తి నష్టాలు, కోర్టులలో గొడవలు, విద్యాభంగం, రోగ భయం, రుణబాధలు, వ్యాపార ఉద్యోగాది వృత్తులలో ప్రతికూలం, స్త్రీ మూలకంగా ఆపదలు, ఆర్ధిక బాధలు కలుగును.

🌸అట్టి సమయం నందు గోమేధికం ధరించిన బాధల నుండి విముక్తి లభించును. మలినంగా దోషములతో కూడిన గోమేధికం ధరించిన దరిద్రం, కష్టనష్టాలు కలుగును. గోమేధికాన్ని “నాగ ధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహీ తన్నో రాహు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 నుండి 5 క్యారెట్స్ కలిగిన గోమేధికాన్నిమద్యవేలుకు శనివారం రోజు శనిహోరలో కిలోన్నర మినుములు దానం చేస్తూ ధరించాలి.

17

సంతాన గోపాల మంత్రం



🌸 సంతాన భాగ్యం కలగాలి అని కోరుకుని, చిన్ని కృషుడు ఎదురుగా ఉన్నట్టుగా భావన చేసి, వెన్న లో పటిక బెల్లం కలిపి నైవేద్యం పెట్టి ఇందులో ఒక మంత్రాన్ని ప్రతిరోజూ యధాశక్తి (108 )జపం చేసి నివేదించిన ప్రసాదం దంపతులు మటుకే తినాలి.

🌸 కృషుడు చిన్ని పాదాలు మువ్వల సవ్వడి మీ ఇంట్లో కదలాడుతునట్టుగా ఆనందగా ధ్యానిస్తూ భావన చేయాలి ఇలా రోజూ పూజ జపం తర్వాత కృష్ణుని ధ్యానం 10 ని పాటు అయినా భావన చేస్తూ చిన్న కన్నయ్యని ఒడిలో కూర్చునట్టుగా మీ మనసుతో చూడాలి ఇలా చేస్తే కృషుడి కి చాలా ఇష్టం మీ ప్రార్ధన స్వీకరిస్తాడు మీ నివేదన ఆరగిస్తాడు మీకు చక్కటి సంతాన భాగ్యం కలుగుతుంది.

🌸సంతానం కోసం ఏ పూజ చేసిన చాలా ప్రశాంతంగా చక్కటి సంతానం పొందుతున్నారు అనే భావన మనసులో నింపుకుని ఆనందంగా చేయాలి ఆ ధ్యానంలో లీనమైపోతారు ఆనందబాష్పలతో పూజను ఆనందిస్తారు..

🌸 ఇలా ప్రయత్నం చేసి చక్కటి సంతానభాగ్యం పొందినవారు ఎందరో ఉన్నారు.. నమ్మకం తో చేసే వారి ఇంట కన్నయ్య అడుగులు పడాలి అని కోరుకుంటున్నాను..నమ్మకంతో చేయండి.

🌸1.ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్ స్వాహా

🌸2.ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా

🌸3.దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః

 

18

హనుమాన్ మన్యుసూక్తం



🌸యస్తే” మన్యోஉవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా

🌸మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః |
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః


🌸అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ |
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’

🌸త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః |
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి


🌸అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః |
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’

🌸అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః |
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః


🌸అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మేஉధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ |
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ

🌸త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః |
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః


🌸అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి |
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ

🌸సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ |
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్


🌸ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి |
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే

🌸విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’உస్మాకం” మన్యో అధిపా భ’వేహ |
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’


🌸ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ |
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’

🌸సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః |
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్


🌸ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||

🌸భద్రం నో అపి’ వాతయ మనః’ ||

🌸ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్యஉభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” నஉఆపో” విశ్వతః పరి’పాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః’ ||

19

వైద్య జోతిష్యం



మానవుని జీవితంలో అనారోగ్య సమస్యలు సాధారణంగా ఉంటాయి. అనారోగ్యాలు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలూ కారణం సంభవిస్తాయి. రాశి, గ్రహం యొక్క కారకత్వం ద్వారా రోగ నిర్ధారణకు వైద్య జ్యోతిషం అవసరం.

ఏ శరీర భాగాలకు అనారోగ్యం కలుగుతుందో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది.

రాశులు - శరీర భాగాలు

మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.

వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.

మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం.

కర్కాటకం - రొమ్ము ,జీర్ణాశయం.

సింహం - గుండె , వెన్నెముక

కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు

తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.

వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం.

ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.

మకరం - మోకాళ్ళు, కీళ్ళు.

కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.

మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.

ద్వాదశ రాశులు మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి,

మిధున , తుల,కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి.

కావున ఈ తత్వానికి సంబందించిన అనారోగ్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని అనారోగ్యాలకు కారణం అవుతాయి.

సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.

బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ మానసిక వ్యాధులు సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

బుధుడు - నాభి, నరము, స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

ఇంద్ర - రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

వరుణ - మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

యమ - వంశ పారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు సంభంధిత అనారోగ్యములకు కారకత్వం వహిస్తాడు

మన శరీర భాగాలలో ఏ భాగం ఏ అనారోగ్యానికి గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి వచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాల కారకత్వం ని అనుసరించి అనారోగ్య సమస్యలను గుర్తించి వాటికి సంబంధించినటువంటి జప దానాలు చేసుకున్నట్లయితే గనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి త్వరితగతిన బయటపడవచ్చు

 

20

హిందూ ఋషులు జాబితా

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు*

🌸*అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష*

🌸దేవర్షి: దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

🌸బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

🌸మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

🌸రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి
అమహీయుడు
అజామిళ్హుడు
అప్రతిరథుడు
అయాస్యుడు
అవస్యుడు
అంబరీషుడు


ఇరింబిఠి


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు
ఉశనసుడు
ఉత్కీలుడు


ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి


ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి


కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి
కౌశికుడు
కురువు
కాణుడు
కలి
కాంకాయనుడు
కపింజలుడు
కుసీదుడు
కౌడిన్యమహర్షి


గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు
గోపథుడు
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు


చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు


జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు


తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి


దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి,
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు


నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు


పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన
ప్రశోచనుడు
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ
ప్రస్కణ్వు

డు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు


భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు
భగుడు
బ్రహ్మర్షి
బృహత్కీర్తి
బృహజ్జ్యోతి
భర్గుడు


మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు
మాతృనామ
మయోభువు
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు


యాజ్ఞవల్క మహర్షి
యయాతి


రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు


వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు
వత్సుడు
వేనుడు
వామదేవుడు
వత్సప్రి
విందుడు


శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు
శౌనకుడు
శంయువు
శ్రుతకక్షుడు


సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు
సుతకక్షుడు
సుకక్షుడు
సౌభరి
సుకీర్తి
సవితామహర్షి సామావేదానికి మూలము
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి


హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి
 

21

కాళీ కవచం


🌸 కాళీ కవచం పారాయణం చేయండి.

భైరవ ఉవాచ
🌸 1. కాళికా యా మహావిద్యా కథితా భువి దుర్లభా ।
తథాపి హృదయే శల్యమస్తి దేవి కృపాం కురు ॥


🌸2. కవచన్తు మహాదేవి కథయస్వానుకమ్పయా ।
యది నో కథ్యతే మాతర్వ్విముఞ్చామి తదా తనుం ॥

శ్రీదేవ్యువాచ
🌸 3. శఙ్కాపి జాయతే వత్స తవ స్నేహాత్ ప్రకాశితం ।
న వక్తవ్యం న ద్రష్టవ్యమతిగుహ్యతరం మహత్ ॥


🌸4. కాళికా జగతాం మాతా శోకదుఃఖవినాశినీ ।
విశేషతః కలియుగే మహాపాతకహారిణీ ॥

🌸 5. కాళి మే పురతః పాతు పృష్ఠతశ్చ కపాలినీ ।
కుల్లా మే దక్షిణే పాతు కురుకుల్లా తథోత్తరే ॥


🌸6. విరోధినీ శిరః పాతు విప్రచిత్తా తు చక్షుషీ ।
ఉగ్రా మే నాసికాం పాతు కర్ణౌ చోగ్రప్రభా మతా ॥

🌸7. వదనం పాతు మే దీప్తా నీలా చ చిబుకం సదా ।
ఘనా గ్రీవాం సదా పాతు బలాకా బాహుయుగ్మకం ॥


🌸8. మాత్రా పాతు కరద్వన్ద్వం వక్షోముద్రా సదావతు ।
మితా పాతు స్తనద్వన్ద్వం యోనిమణ్డలదేవతా ॥

🌸 9. బ్రాహ్మీ మే జఠరం పాతు నాభిం నారాయణీ తథా ।
ఊరు మాహేశ్వరీ నిత్యం చాముణ్డా పాతు లిఙ్గకం ॥


🌸10.కౌమారీ చ కటీం పాతు తథైవ జానుయుగ్మకం ।
అపరాజితా చ పాదౌ మే వారాహీ పాతు చాఙ్గులీన్ ॥

🌸 11. సన్ధిస్థానం నారసింహీ పత్రస్థా దేవతావతు ।
రక్షాహీనన్తు యత్స్థానం వర్జితం కవచేన తు ॥


🌸12. తత్సర్వం రక్ష మే దేవి కాళికే ఘోరదక్షిణే ।
ఊర్ద్ధమధస్తథా దిక్షు పాతు దేవీ స్వయం వపుః ॥

🌸 13. హింస్రేభ్యః సర్వదా పాతు సాధకఞ్చ జలాధికాత్ ।
దక్షిణాకాళికా దేవీ వ్యపకత్వే సదావతు ॥


🌸14.ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్దేవదక్షిణాం ।
న పూజాఫలమాప్నోతి విఘ్నస్తస్య పదే పదే ॥

🌸15. కవచేనావృతో నిత్యం యత్ర తత్రైవ గచ్ఛతి ।
తత్ర తత్రాభయం తస్య న క్షోభం విద్యతే క్వచిత్ ॥

🌸ఇతి కాళీకుల సర్వస్వే కాలీకవచం అథవా శ్రీ దక్షిణ కాళి కవచం సమాప్తి.
 

22

మాణిక్యం(కెంపు)

సూర్యగ్రహ దోష నివారణకు మాణిక్యం(కెంపు)రత్నధారణ విషయాలు

🌸మాణిక్యం స్పటిక ఆమ్ల జాతికి చెందిన రత్నం. అత్యంత విలువైన ఈ రత్నాన్ని పద్మరాగమణి, మాణిక్యం, కెంపు అని కూడా అంటారు. మాణిక్యమణిని సూర్యగ్రహానికి ప్రతిరూపంగా చెబుతారు. బృహత్సంహితలో మాణిక్యమణి మూడు రకాలుగా లభిస్తుందని తెలియజేయబడింది. గంధకం, కురువిందం, స్పటికాలలో ఉద్భవిస్తుందని చెప్పబడింది.

🌸గంధకం నుండి పుట్టినవి పెళుసుగాను, కురువిందం నుండి పుట్టినవి కాంతిహీనంగాను, స్పటికం నుండి పుట్టినవి స్వచ్చంగా, కాంతివంతంగా ఉంటాయని చెప్పటం జరిగింది. మాణిక్యమణిని అత్యదిక వేడి వద్ద వేడి చేసినను ఆకుపచ్చరంగులోకి మారి చల్లారిన తరువాత సహజ సిద్ధమైన రంగులోకి మారుతాయి. రత్నపరీక్ష గ్రంధం ఆదారంగా మనకు ప్రకృతిలో ఆరు రకాల కెంపులు లభ్యమవుతాయి.

🌸రత్నములు ధరించుటలో అనేక విధానాలు కలవు. మనదేశంలో ఎక్కువగా జన్మలగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, దశలను బట్టి ధరిస్తున్నారు. సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలవారు, రవిదశలు నడిచేవారు, జాతకంలో సూర్యుడు జన్మలగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న నీచ స్ధానమైన తులారాశి యందు ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న రవి దశ అంతర్దశలో కష్టాలు కలిగించే సూచనలు ఉన్నాయి కావున జాతకులు తప్పనిసరిగా కెంపు ధరించటం మంచిది.

🌸కెంపు కుడిచేతి ఉంగరం వ్రేలుకి ధరించటం మంచిది. మొదటిసారి దరించేవారు శివాలయంలో అభిషేకం చేపించి “అశ్వద్యజాయే విద్మహే పాష హస్తయా దీమా హీతానో సూర్య ప్రచోదయాత్” అనే మంత్రం జపిస్తూ 3 క్యారెట్స్ బరువు కలిగిన మాణిక్య రత్నాన్ని ఉంగరపు వేలుకు ఒకటిన్నర కిలోల గోధుమలు గాని, గోధుమ రొట్టెలు గాని దానం చేసి ఆదివారం రోజు రవి హోరలో ధరించాలి.

🌸ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మాణిక్యాన్ని గుర్రపు మూత్రం నందు ఒకరోజు నాననిచ్చి మూడు రోజులు తీవ్రమయిన ఎండలో ఉంచి వేడి నీళ్ళతో కడిగి శుద్ధి చేసిన కెంపును జిల్లేడు పాలలో మూడు రోజులు ఉంచి శాస్త్రోక్తంగా పిడకల అగ్నిలో భస్మం చేసిన కెంపు పొడిని స్వీకరించుట వలన అతి మూత్ర వ్యాధి, మంధబుద్ధి, నిద్ర లేమితనం, నేత్రరోగాలు, నపుంసకశక్తి తొలగి సంభోగశక్తి కలుగుతుంది. మాణిక్యమణిని ధరించిన వారికి ప్లేగు, తేలు, పాముల విష సర్పబాధలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. దంత వ్యాధులు, పక్షవాతం, హిస్టీరియా, చర్మ రోగాలు, కీళ్ళవాతాలు మొదలగు వ్యాధులను సమర్ధుడైన ఆయుర్వేద వైద్యుని సలహా పాటించి ఇన్ని వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చును.

కెంపు ధరించటం వలన ప్రయోజనాలు:
🌸జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆరోగ్య కారకుడు సూర్యుడు. తరచుగా అనారోగ్యం కలుగుతున్న వారు, రోగాల బారిన పడి అవస్ధలు పడేవారు, ధన లాభం కొరకు, ఆయువృద్ధి కొరకు, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధికి, అత్యున్నత స్ధాయి కొరకు, మంద బుద్ధి ఉన్నవారు, వాగ్ధాటి, మేధాశక్తి లేనివారు మాణిక్యం ధరించటం మంచిది. శరీరంలోని రక్త ప్రసరణ శక్తిని బాగు పరచి మేధాశక్తిని, వాగ్ధాటిని పెంచుతుంది.

🌸రాజకీయాలు, కోర్టువ్యవహారాలలో రాణింపు, పవిత్రమైన మనస్సు, పట్టుదల, దైర్యసాహసాలు, భూత, భవిష్యత్, వర్తమానకాలాలలో, దూర ప్రదేశాలలో జరుగు విషయాలు తెలుసుకొను శక్తి సామర్ధ్యములు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతి కొరకు, ప్రమోషన్స్ కొరకు కెంపు ధరించటం మంచిది. పూజారులు, పీఠాదిపతులు, భక్తులు తమ తమ దేవతా విగ్రహాల యందు ఉంచి పూజించిన వశీకరణ శక్తి, సర్వకార్య విజయాలు, అనారోగ్యాల పాలిట సంజీవినిగా పని చేస్తుంది.

23

ఖడ్గమాల


🌸మీరు ఏదైనా ఒకటి అనుకోని ఈ ఖడ్గమాల ని 40రోజులు నియమంతో చదవండి. మీపని అయ్యి తీరుతుంది. వీలైతే ఈ ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రానికి కానీ అమ్మవారి పటానికి కానీ కుంకుమ పూజ చేయండి. అప్రయత్నంగా మీపనులు నెరవేరతాయి.

🌸శ్రీ దేవీ ప్రార్థన...
🌸హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||


🌸అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ |

🌸ధ్యానమ్...
🌸ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||
లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |


🌸లం - పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి - నమః
హం - ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి - నమః
యం - వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి - నమః
రం - తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి - నమః
వం - అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి - నమః
సం - సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి - నమః

శ్రీ దేవీ సంబోధనం (1)
🌸ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ.

న్యాసాంగదేవతాః (6)
🌸హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ.

తిథినిత్యాదేవతాః (16)
🌸కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే.

దివ్యౌఘగురవః (7)
🌸పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ.

సిద్ధౌఘగురవః (4)
🌸కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ.

మానవౌఘగురవః (8)
🌸విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ.

శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
🌸అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ.

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
🌸కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ.

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
🌸అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ.

శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
🌸సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ.

శ్రీచక్ర పంచమావరణదేవతాః
🌸సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ.

శ్రీచక్ర షష్టావరణదేవతాః
🌸సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ.

శ్రీచక్ర సప్తమావరణదేవతాః
🌸వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ.

శ్రీచక్ర అష్టమావరణదేవతాః
🌸బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ.

శ్రీచక్ర నవమావరణదేవతాః
🌸శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ.

నవచక్రేశ్వరీ నామాని
🌸త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ.

శ్రీదేవీ విశేషణాని - నమస్కారనవాక్షరీచ
🌸మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |

ఫలశ్రుతిః
🌸ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||


🌸లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||


🌸అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||


🌸మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||


🌸తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||


🌸సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||


🌸ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||


🌸ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||


🌸లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||


🌸అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||


🌸మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ||


🌸తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||
|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

24

లక్ష్మీ గణపతి స్తోత్రం


🌸ఆరోగ్యం మరియు ఆర్ధికంగా స్థిరముగా ఉండుటకు.. అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం లక్ష్మీ గణపతి స్తోత్రం .

విశేషమైన రోజులలో.
🌸ఎక్కువ ఫలితాలను పొందుటకు, లక్ష్మివారం( గురువారం) రోజు సాయంత్రం, గణపతి విగ్రహానికి గరిక నీటితో, మరియు లక్ష్మీ అమ్మ విగ్రహానికి పసుపు నీటితో, అభిషేకం చేసి.
గంధం,
పూలు,
కుంకుమ,
అక్షతలు,
సమర్పించి, ఈ స్తోత్రం ను పఠించాలి, తరువాత క్షీరాన్నం మరియు దద్దోజనం నైవేద్యం గా పెట్టాలి.

🌸ఫలం: ఆరోగ్య సిద్ధి, ధన ప్రాప్తి.

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం
🌸ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం


🌸ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః

స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి


🌸ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం.

 


25

మంగళ చండికా


మంగళ చండికా స్తోత్రం విశిష్టత
🌸కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానా అవస్థలు పడుతున్నారో ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే 'మంగళచండీ దేవి'. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు ... సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది.

🌸ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. కుటుంబ క్షేమానికి మంగళచండీ స్తోత్రం త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుం బమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.

🌸మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు. శత్రు పీడలు, ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.

శ్రీ మంగళ చండికా స్తోత్రం
ధ్యానం :
🌸దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.

శ్రీ మహాదేవ ఉవాచ:-
🌸రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే
మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ
మంగళానామ్ చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.


🌸సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది. మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి. ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది. మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.

🌸గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం!
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం!!


🌸జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్ !!1

🌸ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః!
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్ !!2


🌸దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః!
పాలకం దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్!! 3

🌸విపత్తివాచకో విఘ్నోనాయకః ఖండనార్థకః!
విపత్ ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్ !!4


🌸విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరమ్!
పిత్రా దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం చ త!!5

🌸శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ!
సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహమ్!! 6


🌸విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్ని పుష్పకమ్!
తద్గజేంద్ర ముఖం కాంతం గజవక్త్రం నమామ్యహమ్ !!7

🌸గుహస్యాగ్రే చ జాతోయమావిర్భూతో హరాలయో!
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్ !!8


ఫలశ్రుతి:-
🌸ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసహితం శుభమ్!
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ!! 9

🌸తతో విఘ్నాః పలాయంతే వైనతేయాత్ యథోరగాః!
గణేశ్వర ప్రసాదేవ మహాజ్ఞానీ భవేత్ ధ్రువమ్ !!10


🌸పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ కుశలాం స్త్రియమ్!
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేత్ ధ్రువమ్ !!11

🌸ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణే గణపతి ఖండే శ్రీ గణేశ నామాష్టక స్తోత్రమ్.

 

26

మరకతం(పచ్చ)

బుధ గ్రహ దోష నివారణకు మరకతం(పచ్చ)రత్నధారణ విషయాలు

🌸రత్నశాస్త్ర గ్రంధం నందు పచ్చలను మరకత మణి, గారుడం, హరిన్మణి, తృణగ్రాహి, పన్నా అని కూడా అంటారు. పెగ్మటైట్ పొరల యందు, ఖనిజ పొరల యందు, ప్రవాహములకు కొట్టుకువచ్చే గుళక రాళ్ళ యందు నెమలి కాంతం రంగులో, నాచు వలె, గరిక వలె, మిణుగురు పురుగులా మెరుస్తాయని చిలక రెక్కలవలె, వివిధ రకాలైన పచ్చలు లభిస్తాయని రత్న శాస్త్ర గ్రంధాలలో వివరించబడింది. దోషాలు లేని, మచ్చలేని పచ్చ దొరకటం కష్టం. పచ్చలకు ఎక్కడైనా కొంచమైన మచ్చలు లేకుండా లభ్యం కాదు. “అత్తలేని కోడలు, మచ్చ లేని పచ్చ” ఉండదని లోకోక్తి. బీటలు, మచ్చలు కనబడకుండా ఒక రకమైన తైలం రాస్తారు.

🌸ప్రపంచంలో చారిత్రాత్మక ప్రాదాన్యత సంతరించుకున్న పచ్చలు ఈజిప్ట్ గనుల నుండి లభ్యమవుతాయి. దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాలో ఉదయపూర్, ఆజ్మీర్, ఆప్రికాలోని కొలంబియాలలో పచ్చలు లభ్యమగును. పచ్చని ఎండలో సూర్యునికి ఎదురుగా పెట్టిన మంచి ఆకు పచ్చని కాంతితో మెరుస్తూ బంగారం, తెల్లని వస్త్రం పై పెట్టినప్పుడు ఆకు పచ్చని కాంతిని ప్రసరించును కనుక ‘గరుడ పచ్చ’ అని పేర్కొనటం జరిగింది. అధిక వేడి తగిలిన బరువు లో 99 %తగ్గుతుంది. రాపిడి వల్ల విద్యుచ్చక్తి వస్తుంది.

🌸గరుడ పురాణంలో పచ్చల పుట్టుక గురుంచి ఒక కధ ఉంది. సర్ప రాజు వాసుకి అనే సర్పం, బకాసురుడనే రాక్షసుని యొక్క చేదు కట్టని (పిత్త కోశం) సంగ్రహించి ఆకాశంలో ఎగిరిపోతుండగా వాసుకిని చూసిన గరుత్మంతుడు ఆ జన్మ శతృత్వం వలన ఆకాశంలో ఎగురుచున్న ఆ సర్పారాజుని డీకొని యుద్దం చేయగా గరుత్మంతుని దాటికి వాసుకి నిలవలేక మలయ పర్వత ప్రాంతములలో ఆ చేదు కట్టని విడిచింది. విడిచిన సమయంలో దేదీప్యమానంగా పచ్చదనంతో వెలిగిపోతున్న ఆ చేదుకట్టలో కొంత భాగం గరుత్మంతుడు త్రాగుతాడు. అదియే మరకతం. త్రాగిన కొంతసేపటికి మూర్ఛ కలిగి, పిదప కొంత బైటికి వదిలి వేయగా అదిపడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడ పచ్చలని పేరు. గరుడ పచ్చ గరుత్మంతునిచే జనియించి నందున విషమును హరింపజేయు శక్తి కలిగి ఉంటుంది.

🌸మరొక కధ ప్రకారం నలమహారాజు శనిగ్రహ పీడా విముక్తికి విష్ణుమూర్తిని ప్రార్ధించి శివలింగంను ప్రసాదించమని కోరగా మరకత లింగమును ప్రసాదించాడు. నలుడు ప్రతిష్టించిన మరకత లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో స్వామి వారికి శ్రేష్ఠమైన పచ్చలను ఇవ్వటం జరిగింది. గరుత్మంతుని ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చలు అమిత శక్తి వంతమైనవి.

🌸చిన్న చిన్న గుంటలుగా ఉన్న పుప్పి దోషం ఉన్న, కాంతిహీనమైన గార దోషం ఉన్న. తెల్లని తెట్టవలే ఉన్న కర్క దోషం ఉన్న పచ్చలను ధరించరాదు. పచ్చను వస్త్రంపైన పెట్టి సూర్య కిరణాలకు ఎదురుగా ఉంచినట్లయితే కాంతి నలుమూలల ప్రకాశిస్తూ వస్త్రం పచ్చగా ప్రకాశించును. పచ్చపైన సున్నపు పొర వేసిన పొరలో నుండి కూడా ప్రకాశించు పచ్చలను ధరించటం ఉత్తమం.

🌸ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నేల వంకాయ రసంలో గాని, కొండ పిండి వేళ్ళ రసంలో గాని ఒక రోజు నానబెట్టి పచ్చను భస్మం చేసి వాడిన ఛాతీ, నరాల, మెదడు, నోరు, చర్మ వ్యాదులను, జీర్ణ వ్యవస్ధలోని లోపాలను, మందబుద్ధి, పిచ్చిని తగ్గించును. రసాయన శాస్త్రం ప్రకారం ఇది బేరీలియమ్, సిలికేట్ ల సమ్మేళనం వేడికి మార్పు చెందని క్రోమియం ఆక్సైడ్ ఉన్నందున ఈ రత్నాలకు పచ్చ రంగు వచ్చింది. పచ్చ బుద గ్రహానికి సంబందించినది కావున జ్ఞాన శక్తికి, మానసిక ప్రశాంతతకు, వ్యాపారా భివృద్ధికి, ఉన్నత విద్యలను అభ్యసించుటకు విష్ణుమూర్తి ప్రతి రూపమైన పచ్చను ధరించాలి.

🌸మానసిక ఒత్తిడిని తగ్గించును. వేదాంతులు, పండితశ్రేష్టులు, సివిల్ ఇంజనీర్స్, పురోహితులు, జ్యోతిష్యులు, ఆడిటర్స్, ఉపాన్యాసకులు, కాలేజీ,స్కూల్స్ నడిపేవారు, పుస్తక వ్యాపారులు, లలితా కళాకారులు, చిత్రా లేఖనం చేసేవారు, న్యాయ వాదులు, రత్న పరీక్ష, హోమియో, అల్లోపతి, ఫిజీషియన్స్ తప్పని సరిగా మోక్షాన్ని కలిగించే పచ్చ రత్నాన్ని ధరించాలి.

🌸పచ్చను ధరించిన గణిత శాస్త్రం పైన పట్టు సాధించవచ్చును. పచ్చను ధరించిన క్రీడలలో నైపుణ్యాన్ని, తెలివి తేటలను తడుముకోకుండా వ్యక్త పరచటం, అవతలి వ్యక్తులు ఏది చెబితే విని అర్ధం చేసుకోగలరో అది చెప్పగలిగే వాక్ శుద్ధిని కలిగిస్తుంది. మంచి తెలివితేటలతో వాదోపవాదనలు చేయగలరు. రావణాసురుడు పెద్ద మరకత మణి పైన కూర్చోని భగవంతుని ద్యానం చేసేవాడట.

🌸జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, వక్రించి ఉన్న లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రు స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న, బుధ దశా అంతర్ధశలలో ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మంధ బుద్ధి కలవారు మరకతమణిని ధరించాలి. మరకతమణి ధరించేటప్పుడు “మహాదేవచ్చ విద్మహే విష్ణు పత్నేచ్చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్”అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన పచ్చను చిటికిన వ్రేలుకు గాని, ఉంగరపు వేలుకు గాని బుధవారం రోజు బుదహోరలో పచ్చ పెసర్లను ఒక కిలో పావు దానం చేస్తూ ధరించాలి.

 

27

మూఢమి వివరములు
 

గురు మూఢమి : (ది 10-6-2025 నుండి 09-7-2025 వరకు)శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ చతుర్ధశి.

మంగళవారం రోజున ఉ. 6.15 ని. లకు గురుమౌడ్యం ప్రారంభం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాడ శుద్ధ చతుర్ధశి బుధవారం రోజున రా. 1.30 ని. లకు గురుమౌడ్యం త్యాగం అగును.

 

శుక్ర మూఢమి : (ది 26-11-2025 నుండి 17-2-2026 వరకు) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర బహుళ చవితి.

బుధవారం రోజున మ. 12.20 ని. లకు శుక్రమౌడ్యం ప్రారంభం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ అమావాస్య మంగళవారం రోజున సా. 5.15 ని. లకు శుక్రమౌడ్యం త్యాగం అగును.

 

కర్తరీ నిర్ణయం

 

చిన్న కర్తరీ ప్రారంభం : ది. 4/5/2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం డొల్లుకర్తరీ ప్రారంభం.

 

నిజ కర్తరీ ప్రారంభం : ది. 11/05/2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్ధశి ఆదివారం నిజకర్తరీ ప్రారంభం.

 

కర్తరీ త్యాగం : ది. 28/05/2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ పాడ్యమి బుధవారం కర్తరీత్యాగం పూర్తి అగును.

 

“మృద్దారు శిలాగృహకర్మాణివర్జయేత్” అని కర్తరీ గురించి చెప్పబడిన కారణంగా వాస్తు కర్తరీ అనిపించబడు ఈ కర్తరీలో కర్ర, మట్టి, రాయి ఉపయోగించి చేయు గృహ నిర్మాణాలు ఆరంభించుటకు మంచికాలము కాదు. కర్తరీలో శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాక, షెడ్, పెంకుటిల్లుకు పై కప్పు వేయుట శ్రేయస్కరం కాదు. కర్తరీ విషయంలో వాస్తు విషయంగా మాత్రమే ప్రాధాన్యం యివ్వాలి. ఇతర కార్యములు కూడదనే ప్రమాణాలు కొన్ని గ్రంథాలలో వున్ననూ వాటి ఖండనలు అదే గ్రంథాల నుండి వున్నాయి. అందువలన కర్తరీ అనునది వాస్తు విషయాలకు మాత్రమే."

28

ముత్యం
 

🌸ముత్యాల ను చూసినపుడు మనసుకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. చాలామంది ముత్యాలను ఆభరణాలు రూపంలో కూడా ధరిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాన్ని చాలామంది మనశ్శాంతి కోసం వాడుతారు అని ఆ సమాచారం.

🌸ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైనా చెడు ప్రభావాన్ని చూపవు. అందుకోసమే ఎవరైనా సరే ముత్యాలను ధరించవచ్చు.ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ముత్యాలు కాపాడతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి.

🌸ధైర్యాన్ని కూడా పెంచుతాయి.సహజంగా త్వరగా కోపం వచ్చే వారు.. అలాగే కోపం పై కంట్రోల్ లేని వారు కూడా ముత్యాలను ధరించాలనే శాస్త్రం చెబుతోంది. తద్వారా వారి కోపం తగ్గుతుందట. ఇకపోతే ఎవరైనా సరే ముత్యాలను హారంగా లేదా చేతికి ఉంగరం గా లేదా ముక్కుపుడక రూపంలో ధరించేముందు జ్యోతిష్య పండితులను తప్పనిసరిగా కలవాలని చెబుతున్నారు నిపుణులు.

🌸ఎలాంటి ముత్యం వాడాలో కూడా వారు వివరిస్తారు. ముత్యాలు పుట్టినది ఇండియా, వెనిజులా, పర్షియన్ గల్ఫ్ దేశాలలోనే .. ముత్యాల లో ఉండే ప్రత్యేక గుణాల వల్ల వాటిని చాలా నగల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ముత్యాలను ధరించడం వల్ల అదృష్టం పట్టుకుందట. సిరిసంపదలు కూడా పెరుగుతాయి.

🌸ఇక ఈ రాశుల వారికి గ్రహాల ప్రభావం కూడా పడకుండా ముత్యాలు అడ్డుకుంటాయని.. చందమామ బలహీనపడినప్పుడు గ్రహాల నుంచి వెలువడే నెగిటివ్ ని కూడా ఈ ముత్యాలు అడ్డుకుంటాయని పండితులు చెబుతున్నారు. వైద్య పరంగా చూసుకుంటే ముత్యాలు ధరించడం వల్ల బిపి, మూత్ర సంబంధిత వ్యాధులు, శరీరంలో ద్రవాలను క్రమబద్దీకరించడం, నిద్ర పట్టేలా చేయడం, మానసిక సమస్యలు , గుండెపోటు, మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తాయి. ముత్యం ధరించడం వల్ల సహజ అందం కూడా పెరుగుతుంది. రోహిణి, శ్రవణం, హస్త నక్షత్రాలవారు ముత్యం ధరించటం మంచిది.

🌸ముత్యాలను బంగారము లేక వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరాన్ని ధరించాలి. శ్రావణశుద్ధ పున్నమి నాడు శ్రవణ నక్షత్రములోగాని లేక పూర్ణిమ సోమవారమునాడుగాని, ముత్యములలో కెల్లా శ్రేష్టమైన ఆణిముత్యమువంటి దాన్ని ఉత్తమ చంద్రగ్రహణ సమయములోగానీ, వృషభరాశిలో చంద్రుడు ఏకాదశ స్థానములో నుండుగాగానీ, చంద్రహోర జరిగే సమయములో దుర్ముహూర్తము, వర్జ్యము లేకుండా చూచి మంచి ముత్యమును ఉంగరమునందు బిగించాలి.

🌸ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినమంతయు ఆవుపాలలో అధికజ్ఞాపక, జ్ఞాపకశక్తి, సద్బుద్ధి, గౌరవ-మర్యాదలు పొందగలుట, ఉంచి మరుసటి దినమున తీసి మంచినీటిచే శుద్ధి గావించాలి.

🌸లక్షశాంతత, శ్శాంతి, వ్యాపారవృద్ధి, దాంపత్యసౌఖ్యము, స్త్రీ జనరంజనము ధైర్యముగా పురోగమించటం, కుటంబసుఖ సంతోషాలు, ధనధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కలుగుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట, వివాహాది శుభకార్య భర్తలల్లో సోమవారము లేక శుక్రవారం రోజన వృషభ కర్యాటకములు ఈ ముత్యధారణవల్ల యోగము కలసివచ్చి సంతోషముకల్గుట జరుగగలవు.

🌸ధనులగ్నములందు ఉంగరమును ధరించవలెను. ఉంగరము, అపస్మారము, పిచ్చి, బొలి. చర్మ వ్యాధులు, ఉబ్బసము, మును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే మేహవ్యాధి, కీళ్ళవాతము, అజీర్ణవ్యాధులు, లివర్స్పీస్ మొదలగునవి తొలగును. ముందుగా చంద్రుని యధా ధ్యానించి, కుడ అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం శ్రీం జూం ఈ చంద్రమసే స్వాహా" అనే మంత్రాన్ని నిశ్చలముగా 108 పర్యాయములు జపించిన పిదప ఆ ఉంగరమును కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి. స్త్రీలు మాత్రము ఎడమచేతి ఉంగరపు వ్రేలికి (అనామిక) ధరించటం చాలా విశేషము.

🌸ప్రమాదకరమైన వ్యాధులేగాక స్త్రీలకు సంబంధించిన బహిష్టు దోషములు, సంతానదోషములు మొదలగునవన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు. చంద్రుడు వ్యాపారములకు కొంత వ్యాపారాభివృద్ధి కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమైయున్నది.

🌸స్త్రీలుగానీ, పురుషులుగానరీ, ముత్యములను మాలగాగానీ, ఇతర ఆభరణ ముత్యమును ధరించే పద్ధతి రూపముగా గాని ధరించుటకు కూడా పై విధానప్రకారమే పూజించి ధరించాలి. ముత్యములు అనేకరకాలుగా నున్నప్పటికీ వాటిచ్చాయలు కలిగి ధరించవలెను. ఉంగరమునందలి అడుగు భాగము రంధ్రముగా నుండిన తెల్లని గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించటానికి బహువిధాల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునకు తగిలి శుభఫలాలిచ్చును.

🌸శ్రేష్టమైన ముత్యమునకు బరువు 4 క్యారెట్లు ఉండాలి అనేది నియమము. చంద్రకిరనములు ఉంగరమునందు ప్రవేశించి ఫలసిద్ధికి తోడ్పడ గలవు. ఎంత పెద్దవిగా వుంటే అంతమంచిది. అదీగాక ఒకే ముత్యము ధరించేటప్పడు పెద్దదిగా చూచి ధరించటము అవసరము. ముత్యధారణ మరొక రీతిన చేయవచ్చు.

 

29

27 నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు
 

🌟ద్రాక్షారామం చుట్టుపక్కల అనేక శివాలయాలు, దేవీ మందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నిటిని ఆకాశ మార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి, దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంది. గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట.

మేష రాశి నుండి మీన రాశి వరకు.. అదే క్రమంలో ఆరాధించవలసిన ఆలయాల సమాచారం:

మేష రాశి:
🌟మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో వుంది.

అశ్విని-నక్షత్రం :
పాదం -- స్థలం -- దేవీ దేవతల నామాలు:—

🌟1 వ పాదం... బ్రహ్మపురి.... శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
🌟2 వ... ఉట్రుమిల్లి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
🌟3 వ... కుయ్యూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟4 వ... దుగ్గుదూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

భరణి-నక్షత్రం:
🌟1 వ... కోలంక... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ... ఎంజారం... శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
🌟3 వ... పల్లిపాలెం... శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
🌟4 వ... ఉప్పంగళ... శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కృత్తికా-నక్షత్రం:
🌟1 వ... నేలపల్లి... శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

వృషభ-రాశి:
🌟ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉన్నది.

కృత్తికా-నక్షత్రం:
🌟2 వ... అదంపల్లి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟3 వ... వట్రపూడి... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟4 వ... ఉండూరు... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

రోహిణీ-నక్షత్రం:
🌟1 వ... తనుమల్ల... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
🌟2 వ... కాజులూరు... శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
🌟3 వ... ఐతపూడి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
🌟4 వ... చీల... శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మృగశిర-నక్షత్రం:
🌟1 వ... తాళ్ళరేవు... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
🌟2 వ... గురజానపల్లి... శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

మిధున-రాశి:
🌟ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.

మృగశిర-నక్షత్రం:
🌟3 వ... అంద్రగ్గి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟4 వ... జగన్నాధగిరి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

ఆరుద్ర-నక్షత్రం:
🌟1 వ... పనుమళ్ళ... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ... గొల్లపాలెం... శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
🌟3 వ... వేములవాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
🌟4 వ... కూరాడ... శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి

పునర్వసు-నక్షత్రం:
🌟1 వ... గొర్రిపూడి (భీమలింగపాడు)....శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
🌟2 వ... కరప... శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామి
🌟3 వ... ఆరట్లకట్ల... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

కర్కాటక-రాశి:
🌟ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

పునర్వసు-నక్షత్రం:
🌟4 వ... యెనమాడల... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

పుష్యమి-నక్షత్రం:
🌟1 వ...కాపవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
🌟2 వ... సిరిపురం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
🌟3 వ... వేలంగి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
🌟4 వ... ఓడూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

ఆశ్లేష-నక్షత్రం:
🌟1 వ... దోమాడ... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
🌟2 వ... పెదపూడి... శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟3 వ... గండ్రాడు... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟4 వ... మామిడాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

సింహ-రాశి:
🌟ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

మఖ-నక్షత్రం:
🌟1 వ... నరసరావుపేట... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟2 వ... మెల్లూరు... శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
🌟3 వ... అరికిరేవుల... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
🌟4 వ... కొత్తూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగ లింగేశ్వర స్వామి

పుబ్బ-నక్షత్రం:
🌟1 వ... చింతపల్లి... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
🌟2 వ... వెదురుపాక... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
🌟3 వ... తొస్సిపూడి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
🌟4 వ... పొలమూరు... ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

ఉత్తర-నక్షత్రం:
🌟1 వ... పందలపాక... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

కన్యా-రాశి:
🌟ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లి లోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

ఉత్తర-నక్షత్రం:
🌟2 వ... చోడవరం... శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
🌟3 వ... నదురుబాడు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟4 వ... పసలపూడి... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు

హస్త-నక్షత్రం:
🌟1 వ... సోమేశ్వరం... శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ... పడపర్తి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
🌟3 వ... పులగుర్త... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
🌟4 వ... మాచవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

చిత్త-నక్షత్రం
🌟1 వ... కొప్పవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
🌟2 వ... అర్థమూరు.... శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి

తుల-రాశి:
🌟ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

చిత్త-నక్షత్రం:
🌟3 వ... చల్లూరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
🌟4 వ... కాలేరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

స్వాతి-నక్షత్రం:
🌟1 వ... మారేడుబాక.... శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
🌟2 వ... మండపేట.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
🌟3 వ... గుమ్మిలూరు.... శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
🌟4 వ... వెంటూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

విశాఖ-నక్షత్రం:
🌟1 వ... దూళ్ళ.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
🌟2 వ... నర్సిపూడి.... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
🌟3 వ... నవాబుపేట... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

వృశ్చిక-రాశి:
🌟ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

విశాఖ-నక్షత్రం:
🌟4 వ... కూర్మపురం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

అనూరాధ-నక్షత్రం:
🌟1 వ... పనికేరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
🌟2 వ... చింతలూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
🌟3 వ... పినపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
🌟4 వ... పెదపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

జ్యేష్ట-నక్షత్రం:
🌟1 వ... వడ్లమూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
🌟2 వ... నల్లూరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟3 వ... వెదురుమూడి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
🌟4 వ... తేకి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

ధనుస్సు-రాశి:
🌟ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతిలో ఉన్నది. నేలపర్తిపాడు లోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశి విశ్వేశ్వర స్వామికి అంకితం.

మూల-నక్షత్రం:
🌟1 వ.... యెండగండి.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ.... పామర్రు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟3 వ... అముజూరు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟4 వ... పానంగిపల్లి..... శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి

పూర్వాషాఢ-నక్షత్రం:
🌟1 వ... అంగర... శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
🌟2 వ.... కోరుమిళ్ళ..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟3 వ... కుళ్ళ.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟4 వ.... వాకతిప్ప..... శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి

ఉత్తరాషాఢ-నక్షత్రం:
🌟1 వ.... తాతపూడి.... శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మకర-రాశి:
🌟మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువు లోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ఉత్తరాషాడ-నక్షత్రం:
🌟2 వ--- మచర--- శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
🌟3 వ--- సత్యవాడ---- శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟4 వ--- సుందరపల్లి---- శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి

శ్రవణ-నక్షత్రం:
🌟1 వ--- వానపల్లి...... శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
🌟2 వ....మాదిపల్లి (మాడుపల్లి)-- శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
🌟3 వ.... వాడపాలెం..... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
🌟4 వ.... వీరపల్లిపాలెం.... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

ధనిష్ట-నక్షత్రం:
🌟1 వ.... వెల్వలపల్లి... శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
🌟2 వ... అయినవెల్లి..... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

కుంభ-రాశి:
🌟కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ధనిష్ట-నక్షత్రం:
🌟3 వ..... మసకపల్లి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
🌟4 వ... కుందూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

శతభష-నక్షత్రం:
🌟1 వ.... కోటిపల్లి--- శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ... కోటిపల్లి---- శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
🌟3 వ.... తొట్టరమూడి..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మూల్లేశ్వర స్వామి
🌟4 వ--- పాతకోట.... శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

పూర్వాభాద్ర-నక్షత్రం:
🌟1 వ.... ముక్తేశ్వరం.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
🌟2 వ.... శాసనపల్లి లంక..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
🌟3 వ... తానెలంక..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

మీన-రాశి:
🌟మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.

పూర్వాభాద్ర-నక్షత్రం:
🌟4 వ.... ఎర్రపోతవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

ఉత్తరాభాద్ర-నక్షత్రం:
🌟1 వ.... డంగేరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
🌟2 వ.... కుడుపూరు..... శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
🌟3 వ..... గుడిగళ్ళ---- శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
🌟4 వ.... శివల--- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి

రేవతి-నక్షత్రం:
🌟1 వ... భట్లపాలిక..... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
🌟2 వ.... కాపులపాలెం..... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
🌟3 వ... పేకేరు...... శ్ర లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
🌟4 వ..... బాలాంత్రం..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి..

🌟కుదిరినవారు తప్పక దర్శించగలరు.

 

30

నృశింహ మంత్రం


🌸నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది.

🌸ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం


🌸పైన తెలుపబడింది నృశింహ మంత్రం. ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది.

🌸ఉగ్రం అంటే... నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.

🌸మహావిష్ణుం అంటే... అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు. జ్వలంతం అంటే... సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.

🌸సర్వతోముఖం అంటే... ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం. నృసింహం అంటే.. సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు.

🌸భీషణం అంటే... నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం. అత్యంత భయంకరమైన రూపం ఇది. భద్రం అంటే.. భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. మృత్యుమృత్యుం అంటే.. స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.

🌸ప్రతినిత్యం ప్రతీ ఒక్కరు తప్పకుండా చదువుకోవాల్సిన శక్తివంతమైన స్తోత్రాము. కచ్చితంగా భక్తితో పఠిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది.దైనందిన జీవితం లో అందరం రక రకాల బాధలు, ఇబ్బందుల తో పోరాడుతూ ఉన్నాము. వీటిని చదవడం వాళ్ళ అవి తొలిగిపోవడం, మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. అందరూ మనసుపెట్టి భక్తి తో చదివితే చాలు!

నృసింహ ఋణ విమోచన నృసింహ స్తోత్రం:

🌸దేవతా కార్య సిధ్యర్ధం సభాస్తంభ సముత్భవం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸లక్ష్మా లింగిత వామాంగం భక్తానాం భయదాయకం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸అంత్ర మాలాధరం శంక చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸స్మరణాత్ సర్వ పాపగ్నమ్ కధ్రుజవిషనాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸సింహనాదెన మహతా దిఘ్ధమ్తి భయ నాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸ప్రహ్లాద వరదం శ్రీశం ధైథ్యెశ్వర విధరిణీం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸క్రూరగ్రహైః పీడితానాం, భక్తానామభయప్రదం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸వేదా వేదాంత యగ్నేశం బ్రహ్మ రుద్రాది వన్దితమ్
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే


🌸య ఇధం పాటతే నిత్యం ఋణమోచన సంఘ్నితాం
అనృనీ జయతే సత్యొ ధనం సీగ్రాఃమవాప్నుయాత్.


🌸బుధవారం నృసింహ స్తోత్ర పారాయణ, పూజాధికార్యక్రమలు నిర్వహించడం సకల కష్టాలు, రోగాల బారి నుండి విముక్తి ని ప్రసాదిస్తుంది!!

 

31

నవగ్రహాలు విశేషాలు



01. ఆదిత్యుడు

కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకే ఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతని వాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, అజ్న చక్రం, సహస్రారం ) వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలన ఫలితం పొందుతారు.

సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు

పుష్పం : తామర

వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం

జాతి రాయి : కెంపు

నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

 


02. చంద్రుడు

చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక. అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు, మానసిక ప్రశాంతత. మొదలైన సమస్యలు కలవారు చంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.

కర్కాట రాశికి అధిపతి చంద్రుడు. తూర్పు-దక్షిణ (ఆగ్నేయ) అభిమఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.

ప్రత్యధిదేవత : గౌరి

వర్ణం : తెలుపు

ధాన్యం : బియ్యం / వడ్లు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : ముత్యం

నైవేద్యం : పెరుగన్నం

 


03. మంగళ

అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.

భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి

వర్ణం: ఎరుపు

ధాన్యం : కందిపప్పు

పుష్పం : సంపంగి మరియు తామర

వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం

జాతి రత్నం : ఎర్రని పగడం

నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

 


04. బుధుడు

తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలో రాణించాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి. మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు-ఉత్తర (ఈశాన్య) అభిమఖుడై ఉంటాడు.

అధిదేవత : విష్ణు

ప్రత్యధిదేవత : నారాయణుడు

వర్ణం : చిగురాకు పచ్చ

వాహనం : సింహం

ధాన్యం : పచ్చ పెసర పప్పు

వస్త్రం : పచ్చని రంగు వస్త్రం

జాతి రత్నం : పచ్చ

నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

 


05. గురు

బృహస్పతి అని కూడా అంటారు. దేవతలకు, దానవుల గురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.

పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకు గురువు ని పూజించాలి ధనుస్సు రాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడై ఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ

ప్రతదిదేవత : ఇంద్రుడు

వర్ణం: పసుపు

వాహనం : గజరాజు

ధాన్యం : వేరుసెనగ పప్పు

పుష్పం : మల్లె

వస్త్రం : బంగారు రంగు వస్త్రం

జాతి రత్నం : పుష్య రాగం

నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

 


06. శుక్రుడు

ఉషనల, బృగు మహర్షి ల సంతానం. అసురులకు గురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.

అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది. వృషభ, తులరాశులకు అధిపతి. తూర్పు దిక్కునకు అభిమఖుడై ఉంటాడు.

అదిదేవత : ఇంద్రుడు

వర్ణం : తెలుపు

వాహనం : మొసలి

ధాన్యం : చిక్కుడు గింజలు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : వజ్రం

నైవేద్యం : చిక్కుడు గింజల తో కూడిన అన్నం.

 


07. శని

సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్ర ధారణతో, కాకి వాహనంగా కలిగి ఉంటాడు. శని దేవుడి బాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు. కుంభ, మకర రాశులుకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : యముడు

ప్రత్యాధి దేవత: ప్రజాపతి

వర్ణం : నలుపు

ధాన్యం : నల్ల నువ్వులు

వస్త్రం : నల్లని వస్త్రం

జాతి రత్నం : నీలం

నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

 


08. రాహువు

సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడే రాహువు ను ఒక పాము రూపం . ఒక కత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.

పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవి రాహు ప్రభావములే. పడమర - దక్షిణాభిముఖుడై(వాయువ్య) ఉంటాడు.

అదిదేవత : దుర్గ

ప్రత్యధిదేవత : పాము

వర్ణం : నలుపు

వాహనం : నిలపు సింహం

ధాన్యం : మినుగులు

పుష్పం : అడవి మందారం

జాతిరత్నం : గోమేధుకం

వస్త్రం : నల్లటి వస్త్రం

నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం.

 


09. కేతువు

భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.

పడమర-దక్షిణ (నైరుతి) అభిమఖుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు

ప్రత్యధిదేవత : బ్రహ్మ

వర్ణం : ఎరుపు

వాహనం : గద్ద

ధాన్యం : ఉలవలు

పుష్పం : ఎర్రని కలువ

వస్త్రం : రంగురంగుల వస్త్రం

జాతి రత్నం : వైడుర్యం

నైవేద్యం : ఉలవల అన్నం.

 

32

నీలము స్టోన్
 

శనిగ్రహ దోష నివారణకు "నీలము స్టోన్"రత్న ధారణ విశేషాలు
🌸నీలము రత్నానికి ఇండ్రం, అశ్మఫారం, తృణమణి, మాసారం, సుసారం, గల్వర్కం, భోదకం అనిపేర్లు గలవు. స్పటికామ్ల జనిత లోహ జాతికి చెందినవి. ఇది శనిగ్రహానికి ప్రతీక. శని పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవిల సంతానంగా చెబుతారు. ఒకసారి సూర్యుని మిగతా సంతానానికి శనిపై కోపం వచ్చి గొడవకు దిగటం. ఆ గొడవలో శనిని కొట్టటం, శని కాళ్ళకు దెబ్బ తగలటం జరుగుతుంది. దానితో శని శాశ్వతంగా కుంటుతు, నిధానంగా శ్రమపడుతూ నడుస్తూ ఉంటాడు. అందుకే శనిని మందడు, మందగమనుడు అంటారు.

🌸ఒక్క ఎరుపురంగు తప్ప మిగిలిన రంగులన్నీ సఫైర్గా భావిస్తారు. తల వెంట్రుకల వంటి నల్లటి రంగు కల వాటిని ఇంద్రనీలం అని, భూమి మీద పెట్టినప్పుడు ఆ ప్రాంతమంతా నీలంగా కనపడే వాటిని మహానీలం అని, విష్ణు కాంత పుష్పాల వలె ప్రకాశించేవాటిని నీలమణి అని అంటారు. మయూర నీలం నెమలి కంఠం రంగు నీలంలో ఉంటుంది. ఇంద్రనీలం ధరించిన ఇంద్ర భోగాలు, మహానీలం ధరించిన మహాశక్తి, దరిద్రం తొలగిపోవును. నీలమణి ధరించిన కష్టాలు, నష్టాలు నశించి సుఖశాంతులు పొందగలరు.

🌸నీలం పగిలినచో త్రాస దోషం వలన కలహాలు, కళా విహీనంగా ఉండి భిన్నదోషం వలన బంధువులతో విరోదం, నీలం లోపల పగిలి ఉన్నట్లయుతే పటలదోషం వలన కష్టనష్టాలు, నీలం లోపల ఇసుక కనపడిన ‘పాషాణ గర్భదోషం’ వలన సంతాన నష్టం, నీలమణి లోపల మెత్తని మన్ను ఉన్న‘మృద్గర్భ’అనే దోషం వలన ప్రాణ భయం, ఆపదలు, నీలం పైన రక్తపు చుక్కలు ఉన్న రక్త బిందువు దోషం వలన మరణం కలుగును. కళాహీనంగా ఉండి మలినదోషం, సహజ నీల కాంతులను వెదజల్లక వేరు కాంతులతో ఉన్న ‘విచ్ఛాయ దోషం’ ఉన్న కష్టములు కలుగును. నల్లటి మచ్చలు ఉన్న కరంజి దోషం వలన కలహాలు, తెల్లగా కళావిహీనంగా ఉన్న ‘కుక్షి దోషం’ వలన బాధలు కలుగును.

🌸నీలం ఆవుపాలలో ఉంచి చూసిన ఆ పాలు నీలవర్ణంగా కనపడును. వీటిని‘క్షీరాగ్రాహి’ నీలం అంటారు. ఇది చాలా ప్రశస్తమైన జాతి నీలం. పచ్చగడ్డి పరకలు, ఊక, గసగసాల పొట్టు నీలంపై ఉంచి ఊదిన అవి ఎగిరిపోక నీలమును అంటిపెట్టుకొని ఉన్న ఆనీలం ‘తృణగ్రాహి’ నీలం అంటారు. కాంతులతో ప్రకాశించు నీలం ధరించిన సకల సంపదలు పొందగలరు. వజ్రం తరువాత కఠినమైనది నీలం. సానపెట్టుటకు నీలం సాధ్యం కాదు. నీలం లోపల భాగంలో ఇంద్రధనస్సు వంటి కాంతులు కలగి నీలిరంగులో కనపడిన అది ఇంద్రనీలం.

🌸నీలములు బర్మా, కాశ్మీర్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కాంబోడియా దేశాలలో లభ్యమగును. ఈ రత్నములలో విద్యుచ్చక్తి వంటి శక్తి కలిగి ఉండి శనిగ్రహం నుండి లభించు శక్తిని గ్రహించి మన శరీరంలో ప్రవేశింపజేయగలవు. పుష్యరాగ నీలం, కెంపు నీలం, సిలోన్ నీలం, కాశ్మీర్ నీలం, మయూరి నీలం, కాకి నీలం ఇలా అనేరకాలు కలవు. నీలం ధరించుట వలన శరీరంలోకి శక్తి ప్రవేశించి తేజస్సు, నూతనోత్సాహం కలుగును.

🌸ఆయుర్వేదశాస్త్రం ప్రకారం నీలం స్టోన్ గాడిద మూత్రంలో నానబెట్టి ఒకరోజు అంతయు ఎండలో ఉంచిన తరువాత వేడి నీళ్ళతో కడిగి శుద్ధి చేసి పాలకూర రసములో మూడు రోజులు ఉంచి శుద్ధి చేసిన భస్మం సేవించిన నరముల దుర్భలత్వం, పక్షవాత రోగాలు, మానసిక రోగాలు, పైత్య వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, పిత్తం, పైత్యవ్యాధులను తగ్గించగలదు. ఎలుక కాటు వలన వచ్చే జ్వరాలు, కుష్ఠు రోగములను పోగొట్టును.

నీలం ధరించుట వలన కలుగు ప్రయోజనములు:-
🌸సంఘంలో గౌరవ మర్యాదలను కలుగజేస్తాయి. అపమృత్యు దోషాలను హరిస్తాయి. ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. కష్టనష్టాలు, శత్రువులు తొలగిపోవును. నీలం ధరించిన దృష్టి దోషాలు తొలగిపోవును. వేదాంతంపై ఆసక్తి కలుగును. మనస్సు ప్రశాంతంగా ఉండి స్ధిర చిత్తం కలిగి భగవంతునిపై ఏకాగ్రత పెరుగును.

🌸జాతకంలో లగ్నానికి శని 6,8,12 స్ధానములలో ఉన్న, పుష్యమి, అనురాధా, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళు, నీచస్ధానమైన మేషరాశిలో ఉన్న, శుభగ్రహ దృష్టి లేని శని మహాదశ, అంతర్దశలలో కష్టనష్టములు బాధలు అనుభవించు వారు, గోచారంలో ఎల్నాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని ఉన్నప్పుడు జీవితంలో అనేక కష్టాలు కలగును. నీలం పొదగిన ఉంగరం ధరించిన శని భాధలు తొలగి సుఖ శాంతులు పొందగలరు.

🌸గోచారరీత్యా శని చంద్రరాశికి 12,1,2 స్ధానాలలో ఏడున్నర సంవత్సరాలు ఉన్న ఎల్నాటిశని అంటారు. అష్టమంలో ఉంటే అష్టమశని అని, చతుర్ధంలో ఉంటే అర్ధాష్టమశని అని, సప్తమ, దశమంలో ఉంటే కంటకశని అని అంటారు. వీటివలన జీవనోపాయం, బందికాన, నీచవిద్య, వ్యసనాలు, అతి త్రాగుడు, కీళ్ళనొప్పులు, కామెర్లు, ధననష్టం, ధీర్ఘకాలిక వ్యాధులకు మందులు పనిచేయక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి.

🌸శ్రమకారకుడైన శని కక్ష్యా క్రమంలో మొదట ఉంటాడు కావున సూర్యోదయానికి ఒక గంట ముందు వాకింగ్ గాని, దేవాలయ ప్రదక్షణలు గాని, మేడిటేషన్ గాని చేసిన శని తృప్తి పడతాడు. నీలం దరించేటప్పుడు “ఓం శమగ్నిదగ్ని బిస్కరశ్చన్నస్తపతు సూర్యవంశం వాతో వాత్వరపా అపస్రిదః” అనే శని మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన నీలం స్టోన్ మద్య వేలుకు శనివారం రోజు శని హోరలో కిలో పావు నల్ల నువ్వులు దానం చేసి ధరించవలెను. శని శ్రమ కారకుడుకావున శని వేలు అయిన మద్యవేలుకి ధరించటం ఉత్తమం.

33

నిత్య పారాయణ శ్లోకాః

ప్రభాత శ్లోకః
🌸కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ॥
పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ॥

ప్రభాత భూమి శ్లోకః
🌸సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥

సూర్యోదయ శ్లోకః
🌸బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ॥

స్నాన శ్లోకః
🌸గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

నమస్కార శ్లోకః
🌸త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥

భస్మ ధారణ శ్లోకః
🌸శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ।
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ॥

భోజన పూర్వ శ్లోకాః
🌸బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥

🌸అహం-వైఀశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥

🌸అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥

🌸త్వదీయం-వఀస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥

భోజనానంతర శ్లోకః
🌸అగస్త్యం-వైఀనతేయం చ శమీం చ బడబాలనమ్ ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ॥

సంధ్యా దీప దర్శన శ్లోకః
🌸దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

🌸శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥

నిద్రా శ్లోకః
🌸రామం స్కంధం హనుమంతం - వైఀనతేయం - వృఀకోదరమ్ ।
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥

అపరాధ క్షమాపణ స్తోత్రం
🌸అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥

కరచరణ కృతం - వాఀ కర్మ వాక్కాయజం - వాఀ
శ్రవణ నయనజం-వాఀ మానసం - వాఀపరాధమ్ ।
విహిత మవిహితం-వాఀ సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥

🌸కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥

దేవతా స్తోత్రాః
🌸కార్య ప్రారంభ స్తోత్రాః
శుక్లాం బరధరం-విఀష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥

🌸యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నంతు సతతం-విఀష్వక్సేనం తమాశ్రయే ॥

గణేశ స్తోత్రం
🌸వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥

🌸అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥

విష్ణు స్తోత్రం
🌸శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం-యోఀగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

గాయత్రి మంత్రం
🌸ఓం భూర్భువస్సువః । తథ్సవితుర్వరే᳚ణ్యం ।
భర్గో॑ దేవస్య ధీమహి । ధియోయో నః ప్రచోదయా᳚త్ ॥

శివ స్తోత్రం
🌸త్ర్యంబకం-యఀజామహే సుగంధిం పుష్టివర్ధ॑నమ్ ।
ఉర్వారుకమివ బంధ॑నాన్-మృత్యోర్-ముక్షీయ మాఽమృతా᳚త్ ॥

🌸వందే శంభుముమాపతిం సురగురుం-వంఀదే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం-వంఀదే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంక వహ్నినయనం-వంఀదే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం-వంఀదే శివం శంకరం ॥

సుబ్రహ్మణ్య స్తోత్రం
🌸శక్తిహస్తం-విఀరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజమ్ ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహమ్ ॥

గురు శ్లోకః
🌸గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥

హనుమ స్తోత్రాః
🌸మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం-వఀరిష్టమ్ ।
వాతాత్మజం-వాఀనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥

🌸బుద్ధిర్బలం-యఀశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం-వాఀక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥

🌸జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥

🌸దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

శ్రీరామ స్తోత్రాం
🌸శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః ।
సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు ॥

శ్రీకృష్ణ స్తోత్రం
🌸మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదమ్ ।
గోగోప గోపీజన మధ్యసంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ॥

గరుడ స్వామి స్తోత్రం
🌸కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥

దక్షిణామూర్తి స్తోత్రం
🌸గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥

సరస్వతీ శ్లోకః
🌸సరస్వతీ నమస్తుభ్యం-వఀరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

🌸యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥

లక్ష్మీ శ్లోకః
🌸లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥

దుర్గా దేవీ స్తోత్రం
🌸సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
🌸ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ ॥

దేవీ శ్లోకః
🌸సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

వేంకటేశ్వర శ్లోకః
🌸శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥

దక్షిణామూర్తి శ్లోకః
🌸గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥

బౌద్ధ ప్రార్థన
🌸బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

శాంతి మంత్రం
🌸అసతోమా సద్గమయా ।
తమసోమా జ్యోతిర్గమయా ।
మృత్యోర్మా అమృతంగమయా ।
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥

🌸ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు ।
సర్వేషాం పూర్ణం భవతు,
సర్వేషాం మంగళం భవతు ।
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం శాంతిః శాంతిః శాంతిః॥

స్వస్తి మంత్రాః
🌸స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥

🌸కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥

విశేష మంత్రాః
🌸పంచాక్షరీ మంత్రం - ఓం నమశ్శివాయ

🌸అష్టాక్షరీ మంత్రం - ఓం నమో నారాయణాయ

🌸ద్వాదశాక్షరీ మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ