నక్షత్రం

అశ్విని
భరణి
కృత్తిక
రోహిణి
మృగశిర
ఆరుద్ర
పునర్వసు
పుష్యమి
ఆశ్లేష
మఖ
పూర్వ ఫల్గుణి
ఉత్తర ఫల్గుణి
హస్త
చిత్త
స్వాతి
విశాఖ
అనూరాధ
జ్యేష్టా
మూల
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
శ్రవణా
ధనిష్ఠ
శతభిష
పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర
రేవతి
అశ్విని
భరణి
కృత్తిక
రోహిణి
మృగశిర
ఆరుద్ర
పునర్వసు
పుష్య
ఆశ్లేష
మఖ
పుబ్బ
ఉత్తర
హస్త
చిత్త
స్వాతి
విశాఖ
అనురాధ
జ్యేష్ఠ
మూల
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
శ్రవణ
ధనిష్ఠ
శతభిష
పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర
రేవతి
అశ్విని నక్షత్రము

అశ్విని నక్షత్రము

అశ్విని నక్షత్రము గుణగణాలు :

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య విజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వమువలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోనైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

మీరు చాలా శక్తివంతంగాను మరియు చురుకుగాను ఉంటారు. అదనంగా, మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ప్రాథమిక విషయాలు ఎన్నడూ మీకు సంతృప్తిని ఇవ్వవు మరియు మీరు ఎల్లప్పుడూ పెద్ద విషయాలు చేయాలని తపన పడతారు. ప్రతి పనిని కూడా వేగంగా పూర్తి చేసే అలవాటును కలిగి ఉంటారు. వేగం, శక్తి మరియు చురుకుదనం అనేవి మీలో స్పష్టంగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే, వెంటనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. మీరు కాస్తంత క్రీడాస్ఫూర్తిని కలిగి ఉంటారు మరియు మీరు తెలివైన వారు కూడా. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్న తరువాత మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వభావరీత్యా మీరు, వివాదాస్పదంగా ఉంటారు, దీని వల్ల మీరు మత, క్షుద్రశక్తులు మరియు మర్మకళలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మీరు చాలా నిర్భయంగాను మరియు సాహసోపేతంగా ఉంటారు, కానీ మీరు తప్పనిసరిగా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి.. శత్రువులు మీకు ఎన్నడూ సమస్యలను కలిగించలేరు, ఎందుకంటే వారితో ఎలా వ్యవహరించాలనే విషయం మీకు సహజసిద్ధంగానే తెలుసు. అధికారం, ఒత్తడి లేదా మరేదైనా మిమ్మల్ని నియంత్రించలేదు, కేవలం ప్రేమ మరియు అభిమానం ద్వారా మాత్రమే మిమ్మల్ని గెలవవచ్చు. ఆహార్యం పరంగా మీరు ఎంతో నిశ్శబ్ధంగా, శాంతియుతంగా మరియు నియంత్రితంగా ఉంటారు, మీరు ఎన్నడూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోరు. ఒక విషయం గురించి లోతైన విశ్లేషణ చేసిన తరువాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు, మరియు మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తరువాత, మీ అభిప్రాయాన్ని మార్చడం అంత తేలిక కాదు. ఇతరుల యొక్క ప్రభావంతో నిర్ణయాలు మార్చుకునే స్వభావం మీకు లేదు. మీ పనుల్ని ఎలా పూర్తి చేయాలో మీకు బాగా తెలుసు. వీటన్నింటిని మించి, మీరు ఒక అద్భుతమైన స్నేహితుడిగా రుజువు చేసుకుంటారు. మీరు ఇష్టపడే వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఎవరైనా బాధపడుతున్నట్లుగా మీరు చూస్తే, వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు సహనంగా ఉంటారు మరియు మీకు దేవుడిపై అచంచల నమ్మకం ఉంటుంది. సంప్రదాయల పట్ల మీకు ప్రేమ ఉండటం వల్ల,మీరు ఆధునీకీకరణను వ్యతిరేకిస్తారు. వీటన్నింటికి అదనంగా, మీ పరిసరాలను శుభ్రంగాను మరియు నిర్వహించుకునే విధంగా ఉంచుకుంటారు.

విద్య మరియు ఆదాయం :

కెరీర్లో వీరికి విద్యాశాఖ బాగా సరిపోతుంది. అయితే, ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ, పోలీసెమెన్, మిలటరీ నిపుణులు, సీక్రెట్ సర్వీసులు, ఇంజినీరింగ్, టీచింగ్, ట్రైనింగ్ మొదలైన ఇతర విభాగాలను సైతం మీరు ప్రయత్నించవచ్చు. ఫిలాసఫీ మరియు సంగీతం మీ దృష్టిని ఆకర్షించవచ్చు మరియు అనేక రీతిల్లో ఆదాయాన్ని పొందవచ్చు. 30 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కూడా మీ జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి.

కుటుంబ జీవితం :

అన్నింటిని మించి వీరు వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు. అయితే, తండ్రితో కొన్ని విబేధాలు సంభవించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీమీ అమ్మ తరఫు బంధువులు ఎల్లప్పుడూ వీరి పక్షాన నిలబడతారు మరియు కుటుంబం బయట వారి నుంచి కూడా వీరు సహాయసహకారాలను పొందుతారు. వీరికి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.

నవాంశ ఆధారిత గుణాలు :

అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.

అశ్వని నక్షత్ర నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణాలు కొన్ని ఉంటాయి. అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు. అశ్వినీ నక్షత్రము మూడవ పాదములో పుట్టిన వారు విద్యలయందు ఆసక్తి కలిగి ఉంటారు. అశినీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధ తయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.

అదృష్ట సంఖ్యలు : 1, 4, 5, 9

మణి : వైఢూర్యం / రత్నం

వారములు : ఆదివారము, బుధవారము, శుక్రవారము

ఫలములు : ఏకాగ్రత.

అశ్వని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటగా వ్యవహరించడం, సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.