బల్లి పడితే ఏం చేయాలి ? దోష నివారణం ఏంటీ ?
సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వెలుతూరుకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లి కూడా శకునం పలుకుతుందనీ, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో బల్లి చేసే శబ్ధాలు, శరీరంపై పడితే .. జరిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.