తుమ్మితే అపశకునమా.. తుమ్ముల ఫలితాలు తెలుసుకోండి!!
తుమ్ము మంచి శకునమా .. అపశకునమా.. తుమ్మితే మంచిదా కాదా? తుమ్మితే మేలు బదులు కీడు జరుగుతుందా? వంటి అనేక అనుమానాలు మనలో చాలామందికి ఉంటాయి. అయితే తుమ్ముకు సంబంధించి కొన్ని శకునాలు అనాదిగా ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకున్నాం.
ఎప్పుడైనా ఒకసారి తుమ్మితే మంచిది కాదని, రెండుసార్లు తుమ్మితే మంచిదని చెబుతున్నారు. రెండుసార్లు తుమ్మితే కార్యానుకూలత ఉంటుందని, పనులు జరుగుతాయని చెబుతున్నారు. ఒకసారి తుమ్మితే కీడు జరుగుతుందని చెబుతున్నారు. మంచిది కాదని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే తుమ్మితే శుభం జరుగుతుందని, పసిపిల్లలు, ఐదేళ్ల లోపు వారు, వేశ్య, బాలింతరాలు తుమ్మితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
అంతేకాదు పసిపిల్లలు, ఐదు సంవత్సరాల లోపు వారు తుమ్మితే లాభం కలుగుతుందని, ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఇనుము కానీ, వెండి గాని పట్టుకున్న వాళ్ళు తుమ్మితే కార్యహాని జరుగుతుందని , కంచు కానీ రాగి గాని చేతిలో పట్టుకున్న వారు తుమ్మితే కార్యసిద్ధి జరుగుతుందని చెబుతున్నారు.
ఎవరైనా తుమ్మినప్పుడు బంగారాన్ని, మొసలిని, ఆడవారి నాట్యాన్ని, తాంబూలం వేసుకున్న వారి ముఖాన్ని చూస్తే తుమ్మ వల్ల కలిగిన కీడు నశిస్తుందని చెబుతున్నారు. నీళ్ల కోసం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు పదిమందిలో ఉన్న సమయంలో తుమ్మితే అవమానం మరియు భార్యకు కీడు కలుగుతుందని చెబుతున్నారు. తుమ్ముతూ ప్రయాణం చేయకూడదని ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
బయటకు ఒక పనిమీద వెళ్లేటప్పుడు ముత్తయిదువ, విధవ, కళ్ళు కనిపించని గ్రుడ్డివారు, మాట్లాడలేని మూగ స్త్రీ, అంగవైకల్యం ఉన్న స్త్రీ, కుటిల స్వభావం ఉన్న స్త్రీలు తుమ్మితే అవసరమైన పనైనా వాయిదా వేసుకోవాలని, అలాకాకుండా అలాగే ప్రయాణం చేస్తే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
నాలుగు కాళ్ల జీవి ఎదురైనా , అది తుమ్మితే మంచిది కాదని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రయాణం చేయడానికి సాహసించకూడదని చెబుతున్నారు. తుమ్ముకు సంబంధించి అనాదిగా ఇవి అందరూ చెప్పుకుంటున్న శకునాలు. వీటిని పాటించటం, పాటించకపోవటం విషయంలో ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిదే.