కార్తీక మాసం దీపం ఎలా వెలిగించాలి ?
శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తికం. హిందూ సంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు. చాలా మంది ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటివి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తిక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్ కుమార్' చెబుతున్నారు. ఏ ఆలయాల్లో దీపాలను ఏ విధంగా వెలిగించాలో ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.